పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: సంగారెడ్డి జిల్లా సుల్తాన్‌పూర్ JNTUH కాలేజీ క్యాంపస్ మెస్‌లోని చట్నీలో ఎలుక దర్శనమిచ్చింది. ఇది చూసిన విద్యార్థులు అందరూ షాక్‌కు గురయ్యారు. చట్నీలో ఎలుక అటు ఇటు తిరుగుతూ ఈత కొడుతున్నది. వెంటనే విద్యార్థులు వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే, ఎలుకను చూసిన విద్యార్థులు నిర్వాహకులపై ఫైర్ అయ్యారు. ఇలాంటి ఆహారాలు తింటే ఫుడ్ పాయిజన్‌కు లోనవుతామని ఆవేదన వ్యక్తం చేశారు. చట్నీపై మూత పెట్టకపోవడంతోనే ఎలుక పడిందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్వచ్ఛత లేని ఆహారం తిని విద్యార్థులు అనారోగ్య బారిన పడే అవకాశాలు ఉన్నాయని.., ఈ క్రమంలోనే యాజమాన్యం నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాగా, దీనికి సంబంధించిన వీడియో తాజాగా వైరల్‌గా మారింది.
అయితే దీనిపైన స్పందించిన కాలేజ్ ప్రిన్సిపాల్.. తినేందుకు తయారు చేసిన చట్నీలో ఎలుక పడలేదని.., శుభ్రం చేసేందుకు ఉంచిన పాత్రలో ఎలుక పడిందని పేర్కొన్నారు. పాత్రలో ఉన్న ఎలుకను వీడియో తీసి వైరల్ చేశారని.., కొందరు విద్యార్థులు కావాలనే వీడియో తీసి ప్రజాప్రతినిధులకు పంపారని JNTUH కాలేజీ ప్రిన్సిపాల్ నరసింహ స్పష్టంచేశారు.