IPL 2024: హోం గ్రౌండ్ లో ఆర్సీబీ ఘోర ఓటమి

0
33

బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతా నైట్‌రైడర్స్ టీమ్ తన రికార్డు నిలబెట్టుకుంది. వరుసగా తొమ్మిదో ఏడాది కూడా బెంగళూరుపై నెగ్గింది. సొంత మైదానంలో కేకేఆర్‌తో జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు ఘోర ఓటమిని మూటగట్టుకుంది. 2016 నుంచి చిన్నస్వామి స్టేడియంలో కోల్‌కతాకు ఓటమే ఎదురుకాలేదు. ఈ స్టేడియం కేకేఆర్‌కు సొంత మైదానంలా మారింది.

ఈ IPLలో ఇప్పటివరకు హోమ్ గ్రౌండ్‌లో ఆడిన ఏ జట్టూ ఓడిపోలేదు. కానీ చిన్నస్వామి స్టేడియంలో KKR చేతిలో RCB చతికిలపడింది. 183 పరుగుల టార్గెట్‌ను KKR 3 వికెట్లు కోల్పోయి 19 బంతులు ఉండగానే ఛేదించింది. ఆ జట్టు బ్యాటర్ల ముందు RCB బౌలర్లు తేలిపోయారు. వెంకటేశ్ 50, నరైన్ 47, సాల్ట్ 30, శ్రేయస్ 39 పరుగులు చేశారు. అంతకుముందు కోహ్లీ 83 పరుగులతో రాణించడంతో RCB 182 రన్స్ చేసింది.

ఆస్కార్ ఇవ్వాలి

నిన్నటి మ్యాచులో కేకేఆర్ మెంటర్ గంభీర్, ఆర్సీబీ ప్లేయర్ కోహ్లీని హగ్ చేసుకున్న సంగతి తెలిసిందే. దీనిపై కామెంటేటర్లు రవిశాస్త్రి, గవాస్కర్ భిన్నంగా స్పందించారు. ఈ ఆలింగనానికి కేకేఆర్‌కు ఫెయిర్‌ప్లే అవార్డు ఇవ్వాలని రవిశాస్త్రి అన్నారు. అయితే ఫెయిర్‌ప్లే అవార్డు మాత్రమే కాకుండా ఆస్కార్ కూడా ఇవ్వొచ్చని గవాస్కర్ స్పందించారు