PawanKalyan: పవన్ కళ్యాణ్ విజయంతో సంతోషం వ్యక్తం చేస్తున్న రేణు దేశాయ్

0
15

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: ఇటీవల పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో విజయం సాధించడంతో రేణు దేశాయ్ ఎంతో సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో వరుసగా పోస్టులు చేస్తున్నారు. తన తండ్రి విజయం సాధించిన తర్వాత ఈమె పిల్లలు ఇద్దరు కూడా తన తండ్రి వెంటే ఉంటూ ఎంతో మంది ప్రముఖులను కలుస్తూ ఉన్నారు. ఇలా తన పిల్లలు నరేంద్ర మోదీ వంటి వారిని కలవడం పట్ల ఈమె సంతోషం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

కాగా, తాజాగా రేణు దేశాయ్ మరొక పోస్ట్ చేశారు. తాజాగా ఈమె తన ఇంట్లో పూజ కార్యక్రమాలను చేసుకున్నారని.. ఎంతో సాంప్రదాయబద్దంగా చీర కట్టుకొని చాలా సంతోషం వ్యక్తం చేస్తూ స్వామి వారికి నైవేద్యం తయారు చేస్తున్న ఫోటోలు షేర్ చేశారు. ఇక ఈ ఫోటోలను షేర్ చేసిన రేణు దేశాయ్ తన చేతులతో స్వయంగా ప్రసాదం చేసి పూజ చేస్తే ఎంతో సంతోషంగా ఉంటుందని పేర్కొంది. పూజ హోమం చేసిన తర్వాత చాలా ప్రశాంతంగా ఉన్నట్లు రేణు దేశాయ్ పేర్కొన్నారు. అయితే ఈమె తన మాజీ భర్త ఎన్నికల్లో విజయం సాధించినందుకే ఇలా తన ఇంట్లో పూజలు హోమాలు చేసుకున్నారా అంటూ పలువురు ఈ ఫోటోలపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా రేణు దేశాయ్ మాత్రం ప్రస్తుతం చాలా సంతోషంగా ఉన్నారని తెలుస్తోంది.