RGV Clarity: పిఠాపురం నుంచి పోటీపై ఆర్జీవీ క్లారిటీ

0
19

పిఠాపురం నుంచి పోటీ చేస్తానని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ చేసిన ప్రకటన ఏపీ రాజకీయాల్లో చర్చనీయంశంగా మారింది. పిఠాపురం నుంచి పోటీచేస్తున్నందుకు సంతోషిస్తున్నానని నిన్న ట్వీట్ చేసిన వర్మ పెద్ద హాట్ టాపిక్ గామారారు. దీంతో రామ్ గోపాల్ వర్మ పొలిటికల్ ఎంట్రీ ఇస్తున్నాడని అందరూ అనుకున్నారు. ఎందుకంటే పిఠాపురం నుంచి పోటీ చేస్తున్నానని పవన్ ప్రకటించిన కాసేపటికే ఆర్జీవీ ట్వీట్ చేశారు. అయితే వర్మ నిజంగా పొలిటికట్ ఎంట్రీ ఇస్తున్నాడా? లేదా పవన్ మీద సెటైర్లు వేశాడా అనే చర్చ జరిగింది.దీంతో ఇవాళ మరో ట్వీట్ చేసి మరో బాంబ్ పేల్చారు వర్మ.

తాను పవన్ కళ్యాణ్ పై పోటీ చేయట్లేదని.. అసలు వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశం లేదని తేల్చి చెప్పాడు వర్మ. పిఠాపురం నేపథ్యంలో తాను తీసిన ఓ షార్ట్ ఫిలిమ్ తో ఒక కాంటెస్ట్ కి పోటీ చేస్తున్నానని ట్వీట్ చేశారు. సడన్ డెసిషన్ అన్నాను తప్ప.. ఎన్నికలు అన్న పదం ఎక్కడ వాడలేదాని క్లారిటీ ఇచ్చాడు. అందరూ ముందుగా ఊహించినట్లే పవన్ ని టార్గెట్ చేస్తూ వర్మ ట్వీట్ చేశాడని చర్చించుకుంటున్నారు.

ఇక ఆర్జీవీ సినిమాల విషయానికొస్తే ఇటీవలే ఏపీ సీఎం జగన్ జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు ఆధారంగా వ్యూహం అనే సినిమా చేశారు. ఈ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయ్యింది. ఇప్పుడు శపధం అనే సినిమాను ఓటీటీలో వెబ్ సిరీస్ రానుంది.