నిన్న ఢిల్లీ, ఆర్సీబీ మధ్య మ్యాచ్ హోరాహోరీగా సాగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచులో గెలుపు అంచుల వరకు వచ్చి ఓటమి పాలవ్వడంతో ఆర్సీబీ బ్యాటర్ రిచా ఘోష్ కన్నీరు పెట్టుకున్నారు. ఢిల్లీ ప్లేయర్లు జెమీమా, క్యాప్సీ ఆమెను ఓదార్చేందుకు ప్రయత్నించారు. ఢిల్లీ సారథి మెగ్ లానింగ్ సైతం రిచాను హగ్ చేసుకుని ఓదార్చింది. అయితే రిచా ఫైటింగ్ స్పిరిట్‌ను స్టార్ క్రికెటర్ టీమిండియా స్టార్ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ సైతం రిచాకు సపోర్ట్‌గా నిలిచాడు. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో రిచా ఘోష్ ఫొటోతో ‘యూ ఆర్ ఏ స్టార్’ అంటూ సూర్య రాసుకొచ్చాడు.
182 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన ఆర్సీబీకి ఆదిలోనే బిగ్ షాక్ తగిలింది. రెండో ఓవర్‌లోనే కెప్టెన్ స్మృతి మంధాన (5) పెవిలియన్‌కు చేరింది. సోఫీ మోలినెక్స్ (30), ఎలీస్ పెరీ (49) బెంగళూరు ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. అయితే ఇద్దరూ ఓవర్ వ్యవధిలో పెవిలియన్‌కు చేరారు. ఈ సమయంలో క్రీజులోకి వచ్చిన రిచా ప్రత్యర్ధి బౌలర్లపై విరుచుకుపడింది.
ఆఖరి వరకు ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో కేవలం ఒకే ఒక్క పరుగుతో బెంగళూరు ఓటమి చవిచూసింది. ఈ మ్యాచ్‌లో ఆర్సీబీ ఓటమి పాలైనప్పటికీ ఆ జట్టు వికెట్ కీపర్ బ్యాటర్ రిచా ఘోష్ విరోచిత పోరాటం మాత్రం అందరని అకట్టుకుంది. ఆఖరివరకు రిచా అద్భుతంగా పోరాడనప్పటికి తన జట్టును మాత్రం విజయతీరాలకు చేర్చలేకపోయింది.
బౌండరీల వర్షం కురిపిస్తూ
బౌలర్లపై ఒత్తడి పెంచింది. సోఫీ డివైన్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించింది. ఆ తర్వాత డివైన్ ఔటైనప్పటికీ రిచా జోరు ఏమాత్రం తగ్గలేదు