ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ ఖాతాలో అరుదైన ఘనత చేరనుంది. ఐపీఎల్ చరిత్రలో ముంబై తరఫున 200 మ్యాచులు ఆడిన తొలి ప్లేయర్‌గా ఆయన నిలవనున్నారు. ఇవాళ ఉప్పల్ వేదికగా సన్ రైజర్స్ తో మ్యాచులో ఈ మైలురాయిని చేరుకోనున్నారు.
ఇప్పటివరకు ఏ క్రికెటర్ కూడా ముంబై తరపున 200 మ్యాచ్‌లు ఆడలేదు. ఐపీఎల్ 2011 సీజన్ నుంచి ముంబై ఇండియన్స్‌తో జతకట్టిన హిట్‌మ్యాన్.. ఇప్పటివరకు 199 మ్యాచ్‌లు ఆడాడు. 199 మ్యాచ్‌ల్లో ముంబై తరపున రోహిత్ 5084 పరుగులు చేశాడు. ఐపీఎల్‌లో ముంబై తరపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు కూడా రోహిత్ శర్మనే కావడం విశేషం.
దీంతో ఒకే ఫ్రాంచైజీకి 200 లేదా అంతకంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన మూడో ఆటగాడిగా రోహిత్ నిలవనున్నాడు. రోహిత్ కంటే ముందుగా ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ(239-RCB), ధోనీ(222-CSK) మాత్రమే ఒకే జట్టు తరఫున 200కు పైగా మ్యాచులు ఆడిన ప్లేయర్లుగా ఉన్నారు. ఇక ఐపీఎల్-2024 సీజన్‌ను రోహిత్ ఘనంగా ఆరంభించాడు. గుజరాత్ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 43 పరుగులతో శర్మ అదరగొట్టాడు.