TG Politics: నాగర్ కర్నూల్ లో ట్రయాంగిల్ ఫైట్..మాజీ పోలీస్ బాస్ సత్తా చాటేనా?

0
22

తెలంగాణ లోక్ సభ ఎన్నికల్లో హాట్ సీట్లలో నాగర్ కర్నూల్ ఒకటి. మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఇటీవల బీఎస్పీని వీడి బీఆర్ఎస్ చేరడంతో అందరి దృష్టి నాగర్ కర్నూల్ వైపు వెళ్లింది. నిన్న నాగర్ కర్నూల్ ఎంపీగా బీఆర్ఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ప్రకటించింది. దీంతో నాగర్​కర్నూల్ లోక్​సభ నుంచి పోటీకి మూడు ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఖరారు చేయడంతో ఇక్కడి రాజకీయాలు వేడెక్కాయి.కాంగ్రెస్​నుంచి సీనియర్​ లీడర్​, మాజీ ఎంపీ మల్లు రవి టికెట్​ దక్కించుకోగా, బీజేపీలో చేరిన సిట్టింగ్​ఎంపీ పోతుగంటి రాములు తన కొడుకు పోతుగంటి భరత్​ప్రసాద్​కు టికెట్​ఇప్పించుకోగలిగారు. బీఎస్పీ స్టేట్ చీఫ్​హోదాలో ఉండి ఆ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్​ఆర్.ఎస్.​ ప్రవీణ్​కుమార్​బీఆర్ఎస్ లో చేరి ఆ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నారు. దీంతో నాగర్​కర్నూల్​లో అప్పుడే పార్లమెంట్​పోరు మొదలైంది.

నాగర్ కర్నూల్​పార్లమెంట్​పరిధిలో ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా ఇందులో ఐదు స్థానాల్లో కాంగ్రెస్, రెండు చోట్ల బీఆర్ఎస్​గెలిచింది. కొల్లాపూర్​నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు, అచ్చంపేట నుంచి డీసీసీ ప్రెసిడెంట్​డా.వంశీకృష్ణతో పాటు కల్వకుర్తి, నాగర్​కర్నూల్, వనపర్తి నియోజకవర్గాల్లో కాంగ్రెస్​ పట్టుసాధించింది. ఏడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్ , బీఆర్ఎస్ ఇద్దరు ఎమ్మెల్యేలతో సరిపెట్టుకుంది.​ రెండు పార్టీల మధ్య దాదాపు 11 శాతం ఓట్ల తేడా ఉంది. సీఎం రేవంత్ సొంత జిల్లా కావడం, మంత్రి జూపల్లికి ఇన్ చార్జి బాధ్యతలు ఇవ్వడం కూడా కాంగ్రెస్​కలిసొచ్చే అంశాలు. ఊపుమీదున్న కాంగ్రెస్​క్యాడర్​అసెంబ్లీ ఫలితాలు పునరావృతమవుతాయనే ధీమాతో ఉంది. ​కాంగ్రెస్​టికెట్​దక్కించుకునేందుకు మల్లు రవి, సంపత్​చివరి వరకు పోటీ పడ్డా హైకమాండ్​ మల్లు రవి వైపే మొగ్గు చూపింది.

బీజేపీ నుంచి భరత్​ప్రసాద్​తాను స్థానికుడినని, సిట్టింగ్​ఎంపీ రాములు కొడుకుగా ఆశీర్వదించాలని ప్రచారం చేసుకుంటున్నారు. అచ్చంపేట నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా పనిచేసిన ఎంపీ పోతుగంటి రాములుకు నాగర్​కర్నూల్​జిల్లాలోని నాలుగు అసెంబ్లీ సెగ్మెంట్లలో మంచి పరిచయాలున్నాయి. 2019 పార్లమెంట్​ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్​మధ్య పోరులో అప్పటి బీఆర్ఎస్​అభ్యర్థి అయిన రాములు 1,89,668 ఒట్ల మెజారిటీ సాధించారు.

అలంపూర్​నియోజకవర్గానికి చెందిన ఆర్ఎస్ ప్రవీణ్​ కుమార్​కు అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు అనుకూలమని భావిస్తున్నా అక్కడ కాంగ్రెస్, డీకే అరుణ ప్రభావం ఉంటుంది. అసెంబ్లీ ఎలక్షన్స్​రిజల్ట్​తో నిరాశకు గురైన బీఆర్ఎస్​మాజీ ఎమ్మెల్యేలు ఫలితాలపై ఇప్పటికి పోస్ట్​మార్టం చేసుకుంటున్నారు. అయినా పార్లమెంట్​ఎన్నికలకు మానసికంగా సిద్ధమవుతున్న దాఖలాలు కనిపించడం లేదనే టాక్ నడుస్తోంది. మాజీ మంత్రి నిరంజన్​ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలను ఆర్ఎస్​పీ ఎంత వరకు సమన్వయం చేసుకుంటారు? పార్టీ క్యాడర్​ఎంత వరకు సహకరిస్తుందనే దానిపైనే ఆయన గెలుపు ఆధారపడి ఉంటుంది.