AP News: శాంతి, సుభాష్.. మధ్యలో ఎంపీ విజయసాయి.. అసలు కథ ఏమిటి..?

0
70

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: ఏపీ రాజకీయాలు గత నాలుగు రోజులుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి(Vijay Sai Reddy) చుట్టూ తిరుగుతున్నాయి. ఓ ప్రభుత్వ ఉద్యోగితో విజయసాయిరెడ్డికి లైంగిక సంబంధాలు ఉన్నాయంటూ వచ్చిన ఆరోపణలు కాకరేపుతున్నాయి. ఈ ఆరోపణలు అవాస్తవమని.. తనకు దేవాదాయశాఖలో పనిచేస్తున్న శాంతికి ఎలాంటి సంబంధం లేదని విజయసాయి క్లారిటీ ఇచ్చారు. తనపై కుట్ర జరుగుతోందని ఆరోపించారు. మరోవైపు తాను ఎస్టీ కులానికి చెందిన మహిళను కావడంతో కొందరు టార్గెట్ చేసి అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. విజయసాయి తనకు తండ్రి లాంటివారని శాంతి(Santhi) చెప్పుకొచ్చారు. మరోవైపు శాంతి భర్తనంటూ మదన్‌మోహన్ దేవదాయ శాఖ కమిషనర్‌కు రాసిన లేఖ ఏపీ రాజకీయాల్లో కలకలం సృష్టిస్తోంది.

ఏపీ దేవాదాయశాఖలో అసిస్టెంట్ కమిషనర్ శాంతికి ఎంపీ విజయసాయిరెడ్డి, అడ్వకేట్ సుభాష్‌కు లైంగిక సంబంధాలు ఉన్నాయంటూ మదన్ మోహన్ అనే వ్యక్తి దేవదాయశాఖ కమిషనర్‌కు లేఖ రాయడంతో అసలు వివాదం మొదలైంది. శాంతికి పుట్టబోయేబిడ్డకు తండ్రి ఎవరో తేల్చాలని మదన్ మోహన్ లేఖలో కోరారు. తాను అమెరికాలో ఉన్నప్పుడు శాంతి గర్భం దాల్చిందని.. అక్రమ సంబంధం కారణంగానే శాంతి గర్భం దాల్చిందని మదన్ మోహన్ ఆరోపించారు. దేవాదాయ శాఖ కమిషనర్‌కు రాసిన లేఖ బయటకు రావడంతో విషయం బహిర్గతమైంది.

కాగా, మదన్ మోహన్ లేఖపై స్పందించిన శాంతి.. తనకు పుట్టబోయే బిడ్డకు సుభాష్ తండ్రి అంటూ క్లారిటీ ఇచ్చారు. తనకు ప్రభుత్వ ఉద్యోగం రావడానికి ముందు అడ్వకేట్‌గా ప్రాక్టీస్ చేశానని చెప్పారు. తాను ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి ముందే మదన్ మోహన్‌తో రాత పూర్వకంగా విడాకులు తీసుకున్నానని.. ఆ తర్వాత సుభాష్‌ను పెళ్లి చేసుకున్నట్లు తెలిపారు. అదే సమయంలో విడాకుల కోసం ప్రస్తుతం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. విడాకులు ఇవ్వకుండా సుభాష్‌ను ఎలా పెళ్లి చేసుకున్నారానేదానికి శాంతి సరైన సమాధానం ఇవ్వలేదు. తమ కుల కట్టుబాట్లు ప్రకారం లేఖలు రాసుకోవడం ద్వారా విడాకులు తీసుకున్నాననంటూనే.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించినట్లు తెలిపారు. సుభాష్‌కు శాంతికి పెళ్లైందా లేదా అనేది మాత్రం ప్రశ్నగానే మిగిలిపోయింది. మరోవైపు శాంతి భర్త అమెరికా వెళ్లడానికి గిరిజన మంత్రిత్వ శాఖ ఇచ్చే ఓవర్‌సీస్ స్కాలర్‌షిప్ రావడానికి విజయసాయిరెడ్డి సిఫార్సు లేఖ ఇచ్చారు. దీంతో ఓ ప్లాన్ ప్రకారమే శాంతి తన భర్తను అమెరికా పంపించడానికి ప్లాన్ చేశారా అనే అనుమానాలు కలుగుతున్నాయి. మదన్ మోహన్ తనను రూ.30 కోట్లు అడిగాడని.. తాన నెల జీతం రూ.58 వేలని.. అన్ని కోట్లు ఇవ్వనందుకే మదన్ మోహన్ అసత్య ఆరోపణలు చేస్తున్నారంటూ శాంతి చెబుతున్నారు. మదన్ మోహన్ లేఖపై శాంతి కొంతమేర క్లారిటీ ఇచ్చినా.. ఈ వివాదంలో మరెన్నో అనుమానాలు తలెత్తుతున్నాయి. అదే సమయంలో రోజుకో ట్విస్ట్ బయటకొస్తుంది.

ఈ సందర్భంగా తన మీద వచ్చిన ఆరోపణలపై స్పందించిన ఎంపీ విజయసాయిరెడ్డి.. కొంతమంది తనపై కుట్ర చేశారన్నారు. మీడియారంగంలో ఉన్న కొందరు వ్యక్తులు తన పరువుకు భంగం కలిగించారంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. తన మీద వచ్చిన ఆరోపణలపై తన అభిప్రాయం తీసుకోకుండా ప్రచారం చేసిన మీడియా సంస్థలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానన్నారు. శాంతి వివిధ పనుల నిమిత్తం తనను కలిసిన మాట వాస్తవమేనని.. తనను కలిసినంత మాత్రన లైంగిక సంబంధం అంట్టగట్టడం సరికాదన్నారు. ఓ ఎంపీగా ఉండటంతో తనను శాంతి అనేకసార్లు కలిశారన్నారు. మదన్ మోహన్ తనకు తెలియదంటూనే.. ఒకట్రెండు సార్లు స్కాలర్‌ షిప్ విషయంలో కలిశారని.. తాను ఎంపీగా సిఫార్సు లేఖ ఇచ్చినట్లు తెలిపారు. శాంతికి, తనకు లైంగిక సంబంధమంటూ వచ్చిన ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ.. దీనిపై తాను న్యాయపోరాటం సాగిస్తానని చెప్పారు ఎంపీ విజయసాయిరెడ్డి.

శాంతి, విజయసాయిరెడ్డి, సుభాష్ వ్యవహరం రోజుకో మలుపు తిరుగుతోంది. ఇప్పటివరకు శాంతి, విజయసాయిరెడ్డి స్పందించినప్పటికీ.. సుభాష్ స్పందించలేదు. మదన్ మోహన్ 30 కోట్ల రూపాయిలు డిమాండ్ చేశారని శాంతి చేసిన ఆరోపణలపై మదన్ మోహన్ స్పందించలేదు. విడాకుల విషయంపైనా క్లారిటీ రాలేదు. ఈ అంశంలో రోజుకో ట్విస్ట్ చోటుచేసుకుంటున్న నేపథ్యంలో.. రానున్న రోజుల్లో ఈ వ్యవహరం ఇంకెన్ని మలుపులు తిరగబోతుందనేది వేచి చూడాలి.g