టీమ్ ఇండియా ఫ్యూచర్ స్టార్స్ సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్‌లకు బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు లభించింది. వీరిద్దరికి గ్రేడ్-సీ కాంట్రాక్టు ఇస్తున్నట్లు బీసీసీఐ ప్రకటించింది. నిబంధనల మేరకు మూడు టెస్టులు ఆడటంతో ఈ ఇద్దరినీ ఏడాదికి కోటి రూపాయల ఫీజుతో సెంట్రల్ కాంట్రాక్ట్‌లోని గ్రూప్– సిలో చేర్చింది. ఈ మేరకు సోమవారం జరిగిన బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ సమావేశంలో వీరి పేర్లను ఆమోదించారు.
. గ్రేడ్-సీ కింద వీరు రూ. కోటి వార్షిక వేతనం అందుకోనున్నారు. ఇటీవల ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో వీరిద్దరూ అత్యుత్తమంగా రాణించడంతో బీసీసీఐ ఈ నిర్ణయం తీసుకుంది. వీరితో పాటు మరో 15 మంది క్రికెటర్లు గ్రేడ్-సీ కాంట్రాక్టులో ఉన్నారు. ఇక, ఎక్స్‌పోజర్ ట్రిప్‌ల కోసం ఇండియాకు వచ్చే ఫారిన్ బోర్డులతో బీసీసీఐ అనుబంధ క్రికెట్ సంఘాలు నేరుగా సంప్రదింపులు జరపకూడదని అపెక్స్ కౌన్సిల్ నిర్ణయించింది. ఇందుకోసం బోర్డు నుంచి ఎన్‌ఓసీ తీసుకోవాలని స్పష్టం చేసింది.
కాంట్రాక్టు పొందిన ఆటగాళ్లకు తుదిజట్టులో చోటు దక్కినా ..లేకున్నా బీసీసీఐ కాంట్రాక్టు మొత్తాన్ని చెల్లిస్తుంది. రోహిత్ శర్మ, విరాట్ కొహ్లీ, బుమ్రా, జడేజా లాంటి ఆల్ ఫార్మాట్ ప్లేయర్లు గ్రేడ్- ఏ ప్లస్ కింద ఏడాదికి 7 కోట్ల రూపాయలు కాంట్రాక్టు మనీగా అందుకొంటున్నారు.