ప్రస్తుతం గాయం నుంచి కోలుకుంటున్న టీమ్ ఇండియా క్రికెటర్ మహమ్మద్ షమీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు బీజేపీ ఇప్పటికే ప్రయత్నాలను మొదలుపెట్టిందట. రానున్న లోక్ సభ ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్‌లోని బసిర్‌హత్ నియోజకవర్గం నుంచి ఆయనను బరిలోకి దించాలని బీజేపీ భావిస్తోందట. తద్వారా మైనార్టీల ఓట్లను ఆకర్షించాలనేది కాషాయ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది.
ఇప్పటికే బీజేపీ ప్రతిపాదన పంపగా.. దీనిపై షమీ ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నట్లు సమాచారం. ప్రస్తుతం బసిర్‌హత్ నియోజకవర్గానికి తృణమూల్ కాంగ్రెస్ తరఫున నుస్రత్ జహాన్ ఎంపీగా ఉన్నారు. ఇటీవల దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. తాజాగా ముగిసిన వన్డే వరల్డ్ కప్ తర్వాత షమీ ఇప్పటి వరకు అంతర్జాతీయ క్రికెట్ ఆడలేదు. ఆ టోర్నీలో 24 వికెట్లు తీశాడతను.
కాగా ఇప్పటికే భారత మాజీ క్రికెటర్లు గౌతమ్ గంభీర్, మనోజ్ తివారి తదితరులు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చారు. గౌతమ్ గంభీర్ బీజేపీ ఎంపీగా ఉండగా, మనోజ్ తివారి పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.