పాయింట్ బ్లాంక్, వెబ్డెస్క్: ఏపీసీసీ అధ్యక్షురాలు వైస్ షర్మిల శనివారం ఉత్తరాంధ్రలో పర్యటించారు. ఈ నేపథ్యంలో వైస్ షర్మిల తన అన్న, వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జగన్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. మళ్ళీ ఎన్నికలు వచ్చాయి.. వైసీపీ పార్టీ వాళ్లు ఓటుకు ఎంత ఇస్తారంటా..? అని ప్రజలను ప్రశ్నించారు షర్మిల. ఎవరు ఎంత ఇచ్చినా తీసుకోండి.. కాని ఓటు మాత్రం ఆలోచించి మీ మనస్సాక్షి చెప్పిన వారికే వేయండి అని షర్మిల అన్నారు. మన రాష్ట్రం ఏర్పడి పదేళ్ళు అయిందని.. మెదటి ఐదేళ్ళు నారా చంద్రబాబు ముఖ్యమంత్రిగా చేశారని.. ఆ తరువాత ఐదేళ్ళుగా వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా చేస్తున్నారని.. మరి గడిచిన పదేళ్ళలో చంద్రబాబు ఏం చేశారు..? వైఎస్ జగన్ ఏం చేశారు? మీ బిడ్డలకు ఏమైనా భవిష్యత్ ఉందా..? యువతకు ఉద్యోగాలు వచ్చాయా..? వ్యవసాయం బాగుందా..? అని వైఎస్ షర్మిల ప్రశ్నించారు.
అలానే గత ఎన్నికల్లో ఓట్లేసి మీ ఎమ్మెల్యేని గెలిపించారు.. మరి మీ ఎమ్మెల్యే మీకు ఎప్పుడైనా పనికొచ్చారా..? ఎప్పుడైనా వచ్చారా..? అని ప్రశ్నించారు. కేవలం ఓట్లు కోసం మాత్రమే వచ్చారని అన్నారు. ఇప్పుడు మీ ఎమ్మెల్యే ఇక్కడ పోటి చేయడం లేదంటగా.. చెత్తని ఒక చోటు నుండి తీసుకెళ్ళి మరో చోట డంప్ చేస్తారు తెలుసుగా.. అలానే వైసీపీ ఇక్కడి ఎమ్మెల్యేని తీసుకెళ్ళి మరో చోట నిలుచోబెట్టారంట కదా అని ఎద్దేవ చేశారు. గెలుస్తారు అనే నమ్మకం ఉంటే ఇక్కడే నిలుచోబెట్టాలిగా.. ఎందుకు నిలుచోబెట్టలేదని ఏపీసీసీ అధ్యక్షురాలు ప్రశ్నించారు.