టాలీవుడ్ లో ఎన్నికల సీజన్ వచ్చిందంటే లీడర్ల బయోపిక్స్, పొలిటికల్ డ్రామాలు రిలీజ్ అవుతుంటాయి. ఇవి ఏదో ఓ పార్టీకి సపోర్ట్ గా ఉండటం మరో విచిత్రం. ఐనా.. ప్రేక్షకులు బాగున్నవాటినే, వాస్తవాలు చూపించినవాటినే ఆదరిస్తారన్నది నిర్వివాదాంశం. వైఎస్ వివేకానందరెడ్డి బయోపిక్ సినిమా తీస్తున్నారని.. తీశారని ఎవరికీ తెలియదు. కానీ పూర్తయిపోయింది. హఠాత్తుగా తెరపైకి వచ్చిన ట్రైలర్ చూసి చాలా మంది ఆశ్చర్యపోయారు.
వైఎస్ వివేకా బయోపిక్ మూవీ సీక్రెట్ గా క్వాలిటీగానే తీశారు. మంచి క్వాలిటీతో ఉన్న ఆ ట్రైలర్ ఒక్క సారిగా వైరల్ అయింది. సినిమా ఎప్పుడు రిలీజ్ అనుకుంటూ వస్తున్నారు. కానీ.. సినిమా కూడా రిలీజ్ అయింది. మేకర్స్ ధియేటర్లలో విడుదల చేయాలని అనుకోలేదు. ప్రత్యేక వెబ్ సైట్ ద్వారా పెయిడ్ స్క్రీనింగ్ కు ప్రాధాన్యం ఇచ్చారు. వివేకా బయోపిక్ అనే వెబ్ సైట్ లో ఫుల్ మూవీ పెట్టారు.
కనీసం వంద రూపాయలు డొనేట్ చేస్తే.. మొత్తం సినిమా చూసే అవకాశం కల్పిస్తున్నారు. ఇది పూర్తిగా.. వివేకానందరెడ్డి బయోపిక్ అనే ప్రచారం చేస్తున్నారు. ఆయన ఫోటోలను కూడా వాడుకున్నారు. ఇతర సమస్యలు రాకుండా… పబ్లిక్ రిలీజ్ లేకుండా .. ఇలా పెయిడ్ స్క్రీనింగ్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా తెలుస్తోంది. ముందు పెయిడ్ స్క్రీనింగ్ చేసి.. ఆ తర్వాత ఫ్రీగా వదలబోతున్నట్టు సమాచారం. ట్రైలర్‌లో వివేకానందరెడ్డిని ఎవరు చంపారన్న విషయాన్ని సూటిగా సుత్తి లేకుండా వివరించారు.