TG Politics: ఈడీ కస్టడీలో కవిత.. భగవద్గీత పారాయణం,యోగ

0
38

ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత నిన్న ఏకాదశి సందర్భంగా ఉపవాసం ఉన్నట్లు తెలుస్తోంది. భగవద్గీత పఠనం, భగవన్నామ స్మరణ, ధ్యానం చేస్తున్నారని ఈడీ వర్గాలు తెలిపాయి. ఉపవాసం కారణంగా కొన్ని పండ్లు మాత్రమే ఆమె తీసుకున్నారని పేర్కొన్నాయి. అంబేడ్కర్ జీవిత గాథ సహా పలు పుస్తకాలను అడిగి తెప్పించుకుని చదువుతున్నట్లు సమాచారం. ఇక.. ఈరోజు కవితతో ఆమె తల్లి శోభ భేటీ కానున్నారు.

ఈ నెల 15న కవితను ఈడీ అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు కవితకు ఈ నెల 23 వరకు కస్టడీలో ఉండనున్నారు. కవిత పీఏలు రాజేశ్‌, రోహిత్‌రావులను ఈడీ నిన్న ప్రశ్నించింది. ఆమెను అరెస్టు చేసిన రోజు వీరిద్దరి ఫోన్లను సీజ్‌ చేసిన ఈడీ.. వాటిని వారి ముందే తెరిచి, వాటిలోని వివరాలపై ప్రశ్నించినట్లు తెలిసింది.

మరో వైపు లిక్కర్ స్కామ్ కేసులో తనపై ఎలాంటి బలవంతపు చర్యలు తీసుకోకుండా ఈడీని ఆదేశించాలంటూ సీఎం కేజ్రీవాల్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఇప్పటి వరకు తొమ్మిదిసార్లు సమన్లు జారీ చేయగా, ఆయన విచారణకు గైర్హాజరయ్యారు. ఈడీ అరెస్టు చేసే అవకాశం ఉందని, రక్షణ కల్పిస్తే కేజ్రీవాల్ విచారణకు హాజరవుతారని ఆయన తరఫు లాయర్లు కోర్టుకు తెలిపారు.