సింగరేణి బొగ్గు గనుల సంస్థలో 813 ఎగ్జికూటివ్, నాన్ ఎగ్జిక్యూటీవ్ ఖాళీల భర్తీకి ఆ సంస్థ నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ ఖాళీలను సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగులు, సిబ్బందితోనే భర్తీ చేయనున్నట్లు సంస్థ ప్రకటించింది. మైనింగ్ గ్రాడ్యువేట్ ట్రైనీ 22 ఖాళీలు, అండర్ మేనేజర్ 20, జూనియర్ అక్కౌంట్స్ ఆఫీసర్ 6, జూనియర్ అసిస్టెంట్ గ్రేడ్-2 360, జూనియర్ మైనింగ్ ఇంజనీర్ ట్రైనీ 100, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ 10, అసిస్టెంట్ ఫోర్మెన్ ట్రైనీ (ఎలక్ట్రికల్) 25, ఫిట్టర్ ట్రైనీ 123, ఎలక్ట్రిషియన్ ట్రైనీ 133, వెల్డర్ ట్రైనీ 14 పోస్టులను భర్తీ చేయనున్నట్లు ఆ ప్రకటనలో సంస్థపేర్కొంది.
అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల పంపించాలని, ఈనెల 25వ తేదీ నుంచి 30 వ తేదీ వరకు వెబ్సైట్లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని అధికారులు వివరించారు. ఆన్లైన్లో పంపించిన దరఖాస్తులను డౌన్లోడ్ చేసి ఏప్రిల్ 12వ తేదీలోపు అర్హతా సర్టిఫికెట్ల జిరాక్స్ పత్రాలను జత చేసి జనరల్ మేనేజర్ (పర్సనల్) వెల్ఫేర్, కొత్తగూడెం చిరునామాకు పంపాలని సంస్కృతెలిపింది. మిగిలిన వివరాలను వెబ్సైట్లో పొందుపర్చామని అధికారులు వివరించారు.