సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ పొలిటికల్ ఎంట్రీపై స్పందించారు. ఒక యూట్యూబ్ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రాజకీయాల్లోకి వస్తారా అన్న ప్రశ్నకు భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలంటూ సమాధానమిచ్చారు. ఇక తాను సెంట్రల్ సర్వీసులకు వెళ్తున్నానని వస్తున్న వార్తలను ఆమె ఖండించారు. నేను అప్లయ్ చేసినట్టు నాకే తెలియదు. కొన్ని విషయాలు యూట్యూబ్ లో చూసి తెలుసుకుంటానని తన లైఫ్ గురించి వాళ్లకే ఎక్కువ తెలుసు అంటూ సెటైర్లు వేశారు.
తనపై వచ్చే విమర్శలను పెద్దగా పట్టించుకోనని స్పష్టం చేశారు. ఇక తనకు మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ రాలేదని.. సివిల్స్ ఇంటర్వూలో తనను 12 ప్రశ్నలు అడిగారని చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటానని.. లేటెస్ట్‌గా మహేష్ బాబు గుంటూరు కారం చిత్రం చూశానని వెల్లడించారు.
చిన్పప్పుడు స్విమ్మింగ్, బ్యాడ్మింటన్, మ్యూజిక్ నేర్చుకున్నానని తెలిపారు. మెదక్ ప్రాంతంతో చాలా బ్యూటిఫుల్ మెమరీస్ ఉన్నాయని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి మంచి పనులు చేస్తుండటంతోనే ప్రజలు తనని అభిమానిస్తున్నారని సమాధానమిచ్చారు. కాగా స్మితా సబర్వాల్ ప్రస్తుతం తెలంగాణ ఫైనాన్స్ కమిషన్ మెంబర్ సెక్రటరీగా కొనసాగుతున్నారు. ట్విటర్‌లో ఆమెకు 4 లక్షలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు.