Sudha murthy Nominated Rajya sabha: రాజ్యసభకు సుధామూర్తి.. మోడీ ఏం అన్నారంటే.?

0
14

ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సతీమణి సుధామూర్తిని రాష్ట్రపతి రాజ్యసభకు నామినేట్ అయ్యారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ప్రధాని మోదీ ట్విట్టర్లో తెలిపారు. సామాజిక సేవ, విద్య సహా పలు అంశాల్లో సుధామూర్తి స్ఫూర్తిదాయక ముద్ర వేశారని అన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారని… ఆమె రాజ్యసభలో ఉండటం నారీశక్తికి నిదర్శమని కొనియాడారు. తన బాధ్యతను సుధామూర్తి పూర్తిస్థాయిలో నిర్వర్తిస్తారని ఆశిస్తున్నట్లు మోదీ ఆకాంక్షించారు.

ఒక ఉపాధ్యాయురాలుగా ప్రస్థానం ప్రారంభించిన సుధామూర్తి ఇన్ఫోసిస్ ఫౌండేషన్‌ను ప్రారంభించారు. ఆమె భర్త ఎన్ఆర్ నారాయణ మూర్తి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకులు. సుధా మూర్తి రచయిత, దాతృత్వాన్ని నమ్ముతారు. 2006లో ఆమె చేసిన సామాజిక సేవకు గానూ ప్రభుత్వం భారతదేశపు నాల్గవ అత్యున్నత పౌర పురస్కారం పద్మశ్రీని అందుకున్నారు. 2023లో ఆమెకు భారతదేశపు మూడవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ భూషణ్ కూడా లభించింది.

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు కానుక అంటూ.. ఇవాళ ఉదయమే వంటింటి గ్యాస్ ధరపై రూ. 100 తగ్గిస్తున్నట్లు మోదీ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే.తాము మహిళా సాధికారతకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.