టీ20 వరల్డ్ కప్ టోర్నీకి ఆస్ట్రేలియా కెప్టెన్‌గా మిచెల్ మార్ష్ వ్యవహరించనున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ క్రికెట్‌కు ఫించ్ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత మార్ష్‌ను తాత్కాలిక కెప్టెన్‌గా నియమించారు. ప్రస్తుతం ఆసీస్ వన్డే, టెస్ట్ కెప్టెన్ పాట్ కమిన్స్ టీ20ల్లో కెప్టెన్సీపై ఇంట్రెస్ట్ చూపించడం లేదు. దీంతో మార్ష్ పొట్టి కప్‌కు సారథ్య బాధ్యతలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని హెడ్ కోచ్ ఆండ్రూ తెలిపారు.
”టీ20 జట్టును మార్ష్ నడిపించిన తీరుపై సంతోషంగా ఉన్నాం. ప్రపంచకప్‌లో అతనే నాయకుడిగా భావిస్తున్నాం”అని మెక్‌డొనాల్డ్ తెలిపాడు. 2023లో వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిష్, వన్డే వరల్డ్ కప్‌లో ఆసీస్ జట్టును కమిన్స్ గొప్పగా నడిపించిన సంగతి తెలిసిందే. రెండు ఫైనల్లో భారత్‌పై గెలిచి ట్రోఫీలు అందించాడు. వన్డే వరల్డ్ కప్, టెస్టుల్లో నాయకత్వ నైపుణ్యాలను మెచ్చి సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ జట్టు కెప్టెన్సీ బాధ్యతలను కమిన్స్‌కే అప్పగించిన సంగతి తెలిసిందే.