విజయవాడలో ఇవాళ టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి సమావేశాన్ని నిర్వహించనున్నాయి. పొత్తును ప్రకటించిన అనంతరం ఈ మూడు పార్టీలు కలిసి సమావేశం నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ భేటీలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్, పురందీశ్వరితో పాటు కేంద్ర బృందం పాల్గొని సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నట్లు తెలుస్తోంది. నిన్న కేంద్ర బృందంతో పవన్, పురందీశ్వరి వేర్వేరుగా భేటీ అయి చర్చలు జరిపారు.
ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్ సభ స్థానాలు ఉండగా… బీజేపీ-జనసేనకు 30 అసెంబ్లీ స్థానాలు, 8 ఎంపీ స్థానాలు కేటాయించిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ స్థానాల కంటే ఎంపీ స్థానాలపై బీజేపీ స్పెషల్ ఫోకస్ పెట్టింది. దానికి సంబంధించి ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వరి, సంఘటన్ కార్యదర్శి మధుకర్ సారథ్యంలో బీజేపీ నేతలు ప్రత్యేక కసరత్తు చేయబోతున్నారు.
బీజేపీకి 6 ఎంపీ, 6 ఎమ్మెల్యే స్థానాలు ఖాయం
అరకు- కొత్తపల్లి గీత, రాజమండ్రి- పురంధేశ్వరి
నర్సాపురం- రఘురామకృష్ణరాజు లేదా నరేంద్రవర్మ
తిరుపతి- రత్నప్రభ లేదా నీహారిక
హిందూపురం- సత్యకుమార్, రాజంపేట- కిరణ్‌కుమార్‌రెడ్డి
అనకాపల్లి, ఏలూరుపై క్లారిటీ లేకపోవడంతో చర్చలు
పొత్తులో బీజేపీకి ఆరు అసెంబ్లీ స్థానాలు
విశాఖ నార్త్, పి.గన్నవరం, కైకలూరు, ధర్మవరం
జమ్మలమడుగు, మదనపల్లె, గుంటూరు
మదనపల్లె, గుంటూరులో ఏదో ఒకటి మాత్రమే!
నంద్యాల అసెంబ్లీ టిక్కెట్‌పై అభిరుచి మధు కన్ను