Telangana Board SSC: తెలంగాణలో పదో తరగతి ఫలితాలు ఎప్పుడంటే?

0
17

పదో తరగతి వార్షిక పరీక్షల ఫలితాలు ఏప్రిల్ నెలాఖరులో విడుదలయ్యే అవకాశాలున్నాయి. ప్రధాన పరీక్షలు ముగిసిన నెల రోజుల్లో ఫలితాలను ప్రకటించాలని ప్రభుత్వ పరీక్షల విభాగం లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. ప్రధాన పరీక్షలు నిన్నటితో ముగియగా, కొన్ని మైనర్ సబ్జెక్టుల పరీక్షలు మంగళవారం వరకు జరగనున్నాయి.

పదో తరగతి పరీక్షల జవాబు పత్రాలను మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఏప్రిల్ 3వ తేదీ నుంచి వాల్యూయేషన్ ప్రక్రియ మొదలుకానుంది. మొత్తం తొమ్మిది రోజుల్లో వాల్యూయేషన్ ప్రక్రియను పూర్తి చేసేలా పరీక్షాల విభాగం కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ లెక్క ప్రకారం.. ఏప్రిల్ 11వ తేదీ నాటికి పదో తరగతి పరీక్ష పేపర్ల మూల్యాంకనం పూర్తి కానుంది. 11 జిల్లాల్లోని 19 కేంద్రాల్లో ఈ వ్యాల్యూయేషన్ ప్రక్రియ చేపట్టనున్నారు.

ఇక.. ఈ ఏడాది జరగుతున్న పదో తరగతి పరీక్షల కోసం 5.08 లక్షల మంది విద్యార్థులు ఎగ్జామ్ ఫీజులను చెల్లించారు. ఇందులో 2,57,952 మంది బాలురు కాగా.. 2,50,433 మంది బాలికలు ఉన్నారు. ఈ ఎగ్జామ్స్ కోసం మొత్తం 2,676 కేంద్రాలను ఏర్పాట్లు