తన రాజీనామాపై తమిళిసై స్పందించారు. ప్రజా సేవ కోసం తిరిగి వెళ్తున్నా.. తెలంగాణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. తాను ఎప్పటికీ మీ సోదరినేనని..తనపై చూపిన ప్రేమాభిమానాలకు ధన్యవాదాలని తెలిపారు.
రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమిళిపై తన సొంత రాష్ట్రం అయిన తమిళనాడు నుంచి ఎన్నికల బరిలోకి దిగుతున్నారు. చెన్నై సెంట్రల్ నుంచి లోక్ సభకు పోటీ చేయటానికి లైన్ క్లియర్ కావటంతో తెలంగాణ గవర్నర్ పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన రెండు రోజులకే తన రాజీనామాకు లైన్ క్లియర్ అయ్యింది.
గవర్నర్ పదవి చేపట్టకముందు తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలిగా ఆమె వ్యవహరించారు. 2019 సెప్టెంబర్ 8న ఆమె తెలంగాణ గవర్నర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఆ తర్వాత పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్‌గా అదనపు బాధ్యతలు కూడా నిర్వర్తించారు. ఈ పదవికి కూడా ఆమె రాజీనామా సమర్పించారు. తన రాజీనామా లేఖను రాష్ట్రపతికి పంపించారు.