Rain: తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు

0
31

తెలంగాణలో నేటి నుంచి 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఉత్తర, దక్షిణ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, గద్వాల, వనపర్తి, నాగర్ కర్నూల్, మంచిర్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నారాయణపేట, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్, జగిత్యాల, ములుగు, వికారాబాద్ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే ఛాన్సుందని పేర్కొంది.

రాష్ట్రంలో ఆదివారం ఉదయం నుంచి వాతావరణం మారిపోయింది. చాలా చోట్ల మబ్బుపట్టింది. సడన్​గా టెంపరేచర్లూ తగ్గిపోయాయి. 40 డిగ్రీలలోపు టెంపరేచర్లు రికార్డయ్యాయి. అత్యధికంగా జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లిలో 39.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వనపర్తి జిల్లాలో 39.3, నాగర్​కర్నూల్​లో 39.2, ఆదిలాబాద్​లో 39 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి.

మిగతా జిల్లాల్లో 38లోపే ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. పలు చోట్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా సంగారెడ్డి జిల్లా నాగలగిద్దలో 3.4 సెంటీమీటర్ల వర్షం పడింది. కంగ్టిలో 2.3 సెంటమీటర్ల వర్షపాతం నమోదైంది. వడగండ్ల ప్రభావం ఉన్న రాష్ట్రాల్లో రైతులకు భారత వాతావరణ శాఖ పలు సూచనలు చేసింది. తెలంగాణతో పాటు మధ్యప్రదేశ్, విదర్భ, ఛత్తీస్​గఢ్​, ఒడిశా, జార్ఖండ్​ రాష్ట్రాల్లోని రైతులకు వడగండ్ల నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించింది. పండ్లు, కూరగాయల తోటలను వడగండ్ల నుంచి రక్షించుకునేలా నెట్స్​ ఏర్పాటు చేసుకోవాలని సూచించింది.