TG Politics: ఇవాళ తెలంగాణ గవర్నర్ గా రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం

0
16

తెలంగాణ గవర్నర్ సీపీ రాధాకృష్ణన్ నియమితులయ్యారు. గవర్నర్ తమిళిపై రాజీనామా కు ఆమోదం తెలిపిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము.. ఆమె స్థానంలో ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్ గా విధులు నిర్వర్తిస్తున్న సీపీ రాధా కృష్ణన్ కు బాధ్యతలు అప్పగించింది. తెలంగాణతో పాటు తమిళిపై చూసిన పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా ఆయనకే అప్పగించారు. తెలంగాణాకు పూర్తిస్థాయి గవర్నర్ ను నియమించే వరకూ రాధాకృష్ణన్ కొనసాగుతారని రాష్ట్ర పతి ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

గవర్నర్ నియమితులైన సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారానికి తెలంగాణ రాజ్ భవన్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. బుధవారం ఉదయం 11.15 గంట లకు తెలంగాణ హైకోర్టు చీఫ్ జస్టిస్ అలోక్ ఆరాదె ఆయనతో ప్రమాణం చేయించనున్నారు. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం అనంతరం ఆయన పదవీ బాధ్యతలను చేపట్టనున్నారు

సీపీ రాధాకృష్ణన్ తమిళనాడుకు చెందినవారు. కోయంబత్తూరు లోక్‌సభ స్థానం నుంచి రెండు సార్లు బీజేపీ ఎంపీగా ఎన్నికయ్యారు. రాష్ట్ర బీజేపీ చీఫ్‌గానూ పనిచేశారు. ఆల్ ఇండియా కాయర్ బోర్డు ఛైర్మన్‌గా(2016-2019) సేవలందించారు. గతేడాది ఫిబ్రవరిలో ఝార్ఖండ్ గవర్నర్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇప్పుడు తెలంగాణ గవర్నర్‌గా, పుదుచ్చేరి ఇన్‌ఛార్జ్ లెఫ్టినెంట్ గవర్నర్‌గా పనిచేయనున్నారు.