ఎన్నికల దగ్గర పడుతుండటతో అధికార పార్టీలోకి వలసలు జోరందుకున్నాయి. ప్రతిపక్ష పార్టీలు, బీఆర్ఎస్ ,బీజేపీ నుంచి కాంగ్రెస్ లో చేరుతున్నారు. లేటెస్ట్ గా హైదరాబాద్ లో కీలకంగా మారిన కంటోన్మెంట్ బీజేపీ ఇన్ ఛార్జ్ శ్రీ గణేష్ కాంగ్రెస్ లో చేరారు. నిన్న టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ తన నివాసంలో శ్రీ గణేష్ కి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వనించారు. శ్రీ గణేష్ కి కంటోన్మెంట్ టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తోంది
గత ఎన్నికల్లో ఇక్కడ బీఆర్ఎస్ నుంచి లాస్య నంది గెలిచారు. కాంగ్రెస్ నుంచి గద్దర్ కూతురు వెన్నెల..బీజేపీ నుంచి శ్రీ గణేష్ పోటీ చేశారు. లాస్య నందిత చేతిలో శ్రీ గణేష్ స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు.
లాస్య నందిత రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో లోక్ సభ ఎన్నికలతో పాటే కంటోన్మెంట్ కు పోలింగ్ జరగనుంది. ఈ క్రమంలో మళ్లీ కంటోన్మెంట్ లో పొలిటికల్ హీట్ మొదలయ్యింది. ఈ సారి కాంగ్రెస్ టికెట్ గద్దర్ కూతురుకు ఇవ్వకపోచ్చనే ప్రచారం జరుగుతోంది. ఆమెకు ఏదైనా నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి…శ్రీ గణేష్ కు టికెట్ ఇవ్వాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి లాస్య నందిత సోదరి నివేదిత పోటీ చేస్తానని ఇప్పటికే ఆమె ప్రకటించారు. త్వరలో కేసీఆర్‌ను కలిసి భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని నివేదిత వెల్లడించారు.