TG Politics: కవిత అరెస్టు.. నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ధర్నాలు

0
18

ఎమ్మెల్సీ కవిత అరెస్టును నిరసిస్తూ నేడు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ ఆందోళనలు చేపట్టనుంది. బీజేపీ రాజకీయ దురుద్దేశంతోనే తమ ఎమ్మెల్సీని అరెస్టు చేసిందని మాజీ మంత్రి హరీశ్ రావు ఫైరయ్యారు. అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయాలని గులాబీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ ధర్నాల్లో పార్టీ కార్యకర్తలతో పాటు మహిళా సంఘాలు, మహిళలు భాగమయ్యేలా బీఆర్ఎస్ పార్టీ ప్రణాళికలు రచిస్తోంది.

రూల్స్ ప్రకారమే సోదాలుకవితను రూల్స్ ప్రకారమే ఈడీ అధికారులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ముందుగా సోదాలు నిర్వహించిన అధికారులు ఆ తర్వాత ఆమెను అదుపులోకి తీసుకున్నారు. సుప్రీంకోర్టు కూడా కవితను అరెస్ట్ చేయొద్దని ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వకపోవడం గమనార్హం. కేసు విచారణను మాత్రమే వాయిదా వేస్తూ వచ్చింది.

ముగిసిన వైద్య పరీక్షలుకవితకు ఈడీ కార్యాలయంలో వైద్య పరీక్షలు ముగిశాయి. మరికాసేపట్లో ఆమెను రౌస్ అవెన్యూ కోర్టులో ఈడీ ప్రవేశపెట్టనుంది. కవితను కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరనుంది. మరోవైపు తన అరెస్టును కవిత సవాల్ చేయనున్నట్లు సమాచారం. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది.