TG Politics: కేసీఆర్ ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తా: రసమయి

0
21

బీఆర్ఎస్‌ను వీడిన కడియం శ్రీహరి కేసీఆర్‌పై బురద చల్లడం సరికాదని ఆ పార్టీ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. దళితులపై ఆయన లేనిపోని కుట్రలు చేశారని, వరంగల్‌లో కడియంపై చావు డప్పు కొడతామని హెచ్చరించారు. ముసలి నక్కలన్నీ కాంగ్రెస్‌లో చేరుతున్నాయని విమర్శించారు. తాము కేసీఆర్ వెంటే ఉంటామని, పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే వరంగల్ ఎంపీగా పోటీ చేస్తానని రసమయి ప్రకటించారు.

కడియం శ్రీహరి వైఖరి వల్లే వరంగల్ జిల్లాలో తాడికొండ రాజయ్య, ఆరూరి రమేశ్‌‌ బీఆర్ఎస్‌‌ను వీడారని రసమయి బాలకిషన్ అన్నారు.బీఆర్ఎస్‌‌లో సభ్యత్వం లేని కావ్యకు కేసీఆర్‌‌ను విమర్శించే అర్హత లేదన్నారు. కేశవరావుకు మతి భ్రమించినట్లు మాట్లాడుతున్నారని ఫైర్‌‌‌‌ అయ్యారు. మిలియన్ మార్చ్‌‌లో కేకేను కోడిగుడ్లతో కొట్టిన ఘటనను బాలకిషన్ గుర్తుచేశారు. కేశవరావు బిడ్డ గద్వాల విజయలక్ష్మి ఎవరికీ తెలియదని.. అయినా ఆమెను కేసీఆర్ మేయర్‌‌ను చేశారన్నారు. ఓట్ల కోసం గద్దర్‌‌‌‌ను వాడుకున్న చరిత్ర కాంగ్రెస్ పార్టీదని ధ్వజమెత్తారు.

వరంగల్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా నిన్ననే కడియం కూతురు కావ్య పేరును ప్రకటించింది కాంగ్రెస్. బీజేపీ నుంచి ఆరూరి రమేష్ పోటీచేస్తున్నారు. బీఆర్ఎస్ ఇంకా అభ్యర్థిని ప్రకటించలేదు.