TG Politics: బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా రాజయ్య?

0
14

సీనియర్ నేత కడియం శ్రీహరి ఆయన కూతురు కావ్య పార్టీ మారడంతో వరంగల్ ఎంపీ అభ్యర్థిపై బీఆర్ఎస్ కసరత్తు చేస్తోంది. పార్టీ మారిన మూడు రోజులకే కావ్యకు కాంగ్రెస్ ఎంపీ టికెట్ కేటాయించడంతో ఆమెను ఓడించేందుకు తగిన ప్రత్యర్థిని ఎంపిక చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, పెద్ది స్వప్న, పరంజ్యోతి పేర్లను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు టికెట్ దక్కించుకుంటారో వేచి చూడాలి.

అయితే వీరిలో స్టేషన్ ఘన్ పూర్ మాజీ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్యకు టికెట్ దక్కే అవకాశం కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల తరువాత బీఆర్ఎస్ నుంచి బయటికి వెళ్లిన రాజయ్య యూ టర్న్ తీసుకుని మళ్లీ బీఆర్ఎస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. . ఎంపీ టికెట్ హామీ ఇస్తే రాజయ్య గులాబీ కండువా కప్పుకోనున్నారనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆయనతో కలిసి మంతనాలు కూడా జరిపినట్లు సమాచారం.

వ‌రంగ‌ల్ పార్లమెంట‌రీ టికెట్ విష‌యంలో మొద‌టి నుంచి బీఆర్ఎస్‌లో క‌న్ఫ్యూజ‌న్ క్రియేట్ చేసింది. క‌డియం కావ్య, అరూరి ర‌మేశ్, తాటికొండ రాజ‌య్య, సిట్టింగ్ ఎంపీగా ఉన్న ప‌సునూరి ద‌యాక‌ర్ ఇలా చాలా పేర్లు తెర‌పైకి వ‌చ్చి మ‌రుగున ప‌డుతూ వ‌చ్చాయి. ముందు టికెట్ కోసం కొట్లాడిన అరూరి ర‌మేశ్ ఆ త‌ర్వాత పార్టీ అంత‌ర్గత రాజ‌కీయాల‌ను త‌ట్టుకోలేక‌ బీజేపీలోకి జంప్ అయ్యారు. క‌డియం శ్రీహ‌రి వైపు మొగ్గు చూపుతూ త‌ర్వాత‌ కావ్యకు అవ‌కాశం క‌ల్పించారు. కావ్య కాద‌న‌డంతో ఇప్పుడు మ‌ళ్లీ అభ్యర్థిని వెతికి ప‌ట్టుకునే పనిలో ప‌డ్డారు.