ఆదిలాబాద్ కాంగ్రెస్ ఎంపీ టికెట్ ఆత్రం సుగుణకు దక్కింది. ఉట్నూర్ జడ్పీ పాఠశాలలో SAగా పని చేసిన ఆమె.. మరో 13 ఏళ్ల సర్వీసు ఉండగానే రాజకీయాలపై ఆసక్తితో ఈ నెల 12న రాజీనామా చేశారు. టీచర్ కాకముందు ఎంపీటీసీగా పని చేశారు. సుగుణ భర్త కూడా టీచరే. ఈమె తెలంగాణ ఉద్యమంతో పాటు ఉపాధ్యాయ, ఆదివాసీ ఉద్యమాల్లో క్రియాశీలకంగా పని చేశారు. మంత్రి సీతక్కతో సన్నిహిత సంబంధాలు టికెట్ దక్కడానికి కలిసివచ్చాయి.
కాంగ్రెస్ ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో పొరపాటు చోటు చేసుకుంది. ఆదిలాబాద్ స్థానం నుంచి ఆత్రం సుగుణ పేరు ప్రకటించాల్సి ఉండగా.. డా.సుగుణ కుమారి చెలిమల పేరును ప్రకటించింది. అయితే.. ఆత్రం సుగుణ పేరును మంత్రి సీతక్క ఖరారు చేశారు. ఆమెకు ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారు. ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా పని చేసిన సుగుణ ఇటీవల ఉద్యోగానికి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు.
ఎంపీ అభ్యర్థి ఎంపిక విషయం కాంగ్రెస్‌లో ఎన్నో మలుపులు తిరిగింది. ఓ దశలో సీఎంవో నుంచి ఆదిలాబాద్ రిమ్స్ ప్రొఫెసర్ డా.సుమలత పేరు తెరపైకి వచ్చింది. అంతకుముందు ఖానాపూర్ మాజీ ఎమ్మెల్యే రేఖానాయక్, శాసనసభ ఎన్నికల ముందు టికెట్ ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది.