మహబూబ్ నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉపఎన్నిక పోలింగ్ గురువారం జరింగింది. ఓట్ల లెక్కింపు ఏప్రిల్ రెండో తేదీన చేపట్టాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. మే 13న లోక్సభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు పార్లమెంటు ఎన్నికలపై పడే అవకాశం ఉందని భావిస్తున్న పార్టీలు ఎన్నికల కమిషను ఆశ్రయించాలని ప్రతిపాదించినట్టు సమాచారం. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలోని మహబూబ్ నగర్, నాగర్ కర్నూలు లోక్సభ నియోజకవర్గాలున్నాయి.
ఈ రెండు నియోజకవర్గాల్లో హెూరా హోరీ పోరు సాగే అవకాశముందని పార్టీలు భావిస్తున్నాయి. ఈ తరుణంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాలు లోక్సభ ఎన్నికలపై పడే అవకాశం ఉందన్న రెండు ప్రధాన పార్టీలు కేంద్ర ఎన్నికల కమిషన్ కార్యాలయం మెట్లు ఎక్కేందుకు సిద్ధమయినట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల ఫలితాల అనంతరం ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఫలితాలను ప్రకటించాలని కోరనున్నట్టు చెబుతున్నారు.
కాగా రెండువందల ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవబోతున్నారని సీఎం రేవంత్ రెడ్డి శనివారం గాంధీభవన్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఎన్నికల కమిషన్ తీసుకొనే నిర్ణయంపై మహబూబ్ నగర్ ఎమ్మెల్సీ ఫలితం వెల్లడి ఆధారపడి ఉంది.