TG Politics: టార్గెట్ కాంగ్రెస్.. జనంలోకి కేసీఆర్

0
9

పార్లమెంట్ ఎన్నికలపై సీరియస్ గా దృష్టి సారించారుల కేసీఆర్. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక పూర్తి కావడంతో ప్రచారంపై ఫోకస్ చేస్తున్నారు. ఎన్నికల ప్రచార సరళి, ప్ర జలను ఆకట్టుకునే ఎత్తుగడలపై వ్యూహాలను సిద్ధం చేస్తున్నట్లుగా సమాచారం. కాంగ్రెస్, బీజేపీ పార్టీల కన్నా భిన్నంగా ఈసారి ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించనున్నారు. పెద్ద ఎత్తున భారీ బహిరంగ సభల కంటే రోడ్ షోలు, కార్నర్ మీటింగ్లను ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు.

ప్రచారాన్ని హోరెత్తించేలా కాంగ్రెస్ పై తూటాలను పేల్చేందుకు సిద్ధం అవుతున్నారు. కేసీఆర్ తో పాటు కేటీఆర్, హరీష్ రావు ప్రచారంలో పాల్గొననున్నారు. కేసీఆర్ కంటే ముందే అభ్యర్థుల తరుపున కేటీఆర్, హరీష్ రావు రంగంలోకి దిగి ఊపు తీసుకురానున్నారు. ఇప్పటికే పార్టీ కార్యకర్తలను పార్లమెంట్ ఎన్నికలకు సమాయత్తం చేస్తున్నారు. అభ్యర్థులంతా సొంత నియోజకవర్గాల్లో స్థానిక నేతలు, మాజీ ఎమ్మెల్యేలతో కలిసి సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఎలా ముందుకు వెళ్లాలో వివరిస్తున్నారు.

కారు జోరును పెంచేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెబుతూ సారు అండగా నిలబడుదాం.. కాంగ్రెస్ ను ప్రశ్నిద్దాం అని నేతలు సూచిస్తున్నారు. హరీష్ రావు పంట పొలాల్లోని రైతులను, రైతాంగాన్ని సమయాత్తం చేసే పనిలో నిమగ్నమయ్యారు. కేటీఆర్ సైతం ఒకటి రెండు రోజుల్లో రంగంలోకి దిగబోతున్నట్లు తెలుస్తోంది.