TG Politics: ఫోన్ ట్యాపింగ్ కేసు.. మీడియా ఎండీ ఇంట్లో పోలీసుల సోదాలు

0
15

ఫోన్ ట్యాపింగ్ కేసులో దర్యాప్తు SIB మాజీ DSP ప్రణీత్ రావు దర్యాప్తు కొనసాగుతోంది. ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా నిన్న జూబ్లిహిల్స్ లోని ఓ మీడియా సంస్థ యజమాని శ్రవణ్ కుమార్ ఇంట్లో సోదాలు చేశారు పోలీసులు. ఈ సెర్చ్ లో శ్రవణ్ కుమార్ ఇంట్లో కీలక సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ప్రణీత్ రావు వెనకాల మీడియా సంస్థ యజమాని ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఒక మీడియా సంస్థ యజమాని ఇచ్చిన నెంబర్లను ప్రణీత్ రావు ట్యాప్ చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఆ మీడియా సంస్థ యజమాని దగ్గర ఒక సర్వర్ పెట్టినట్లు అనుమానిస్తున్నారు. BRS కీలక నేత ఆదేశాలతో వరంగల్, సిరిసిల్లలో సర్వర్లు ఏర్పాట్లు చేసినట్లు గుర్తించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఇవాళ జూబ్లీహిల్స్ లోని శ్రవణ్ కుమార్ ఇంట్లో పోలీసులు సోదాలు చేశారు

మరోవైపు ఇవాల్టితో ప్రణీత్ రావు పోలీసుల కస్టడీ ముగియనుంది. ఏడవరోజు ప్రణీత్ రావును ప్రశ్నించనున్నారు. విచారణ తర్వాత ప్రణీత్ రావుకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపర్చనున్నారు. ప్రణీత్ రావు స్టేట్మెంట్ కాపీని కోర్టుకు సబ్మిట్ చేయనున్నారు. విచారణలో తనకు సహకరించిన అందరి పేర్లను ప్రణీత్ రావు చెప్పినట్లు సమాచారం.. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ప్రణీత్‌‌‌‌ రావు సవాల్‌‌‌‌ చేసిన పిటిషన్‌‌‌‌ ను హైకోర్టు కొట్టేసిన సంగతి తెలిసిందే. ప్రణీత్ రావ్ కస్టడీపై కింది కోర్టు ఇచ్చిన కస్టడీ అనుమతి సరైందే అని హైకోర్టు తెలిపింది.