TG Politics: బీసీలకు 50 శాతం టికెట్లు ఇచ్చిన కేసీఆర్

0
16

లోక్ సభ ఎన్నికల్లో పోటీపడే అభ్యర్థుల ఎంపికను బీఆర్ఎస్ పూర్తిచేసింది. ఇప్పటికే 16 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా మిగిలిన ఆ ఒక్క స్థానానికి అభ్యర్థిని ఫైనల్ చేశారు. హైదరాబాద్ లోక్ సభ స్థానానికి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేరును ప్రకటించారు. కాంగ్రెస్ మాత్రం ఇంకా అభ్యర్థుల వేటలోనే ఉండి కొన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటిస్తుండగా, కేసీఆర్ మొత్తం స్థానాలకు అభ్యర్థులను ప్రకటించి పైచేయి సాధించారు. అటు బీజేపీ కూడా మొత్తం 17 స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ ప్రకటించిన మొత్తం 17 స్థానాల్లో 5 రిజర్వుడు సీట్లు పోను సగం స్థానాలను బీసీలకు కేటాయించారు. 12 జనరల్ స్థానాల్లో ఆరు స్థానాలను బీసీలకు ఇచ్చారు. 50 శాతం సీట్లను బీసీలకు కేటాయిస్తూ భారాస ముందడుగు వేసింది. మున్నూరు కాపుకు రెండు, యాదవులకు రెండు, ముదిరాజ్కు ఒక్కటి, గౌడకు ఒక్క స్థానాన్ని కేటాయించింది. మిగిలిన ఆరు సీట్లలో నాలుగు స్థానాలు రెడ్డిలకు ఇవ్వగా, ఒకటి వెల్మ, ఒకటి కమ్మలకు కేటాయించారు. ఎస్టీల స్థానాల్లో ఒకటి లంబాడి, మరొకటి ఆదివాసీలకు ఇచ్చారు. మూడు ఎస్సీ స్థానాల్లో ఒకటి మాల, రెండు మాదిగలకు టికెట్ ఇచ్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తక్కువ సీట్లు ఇచ్చామన్న విమర్శలను ఎదుర్కొన్న బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో సమన్యాయం పాటించేందుకు మొగ్గు చూపింది.

బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు వీరే

ఖమ్మం – నామా నాగేశ్వర్ రావు (ఓసీ)
మహబూబాబాద్ – మాలోత్ కవిత (ఎస్టీ)
కరీంనగర్ – బోయినిపల్లి వినోద్ కుమార్ (ఓసీ) –
చేవెళ్ల కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ (బీసీ)
పెద్దపల్లి -కొప్పుల ఈశ్వర్ (ఎస్సీ)
మహబూబ్ నగర్ – మన్నె శ్రీనివాస్ రెడ్డి (ఓసీ) – –
వరంగల్ డాక్టర్ కడియం కావ్య (ఎస్సీ) –
నిజామాబాద్ బాజి రెడ్డి గోవర్ధన్ (బీసీ) –
జహీరాబాద్ గాలి అనిల్ కుమార్ (బీసీ)
ఆదిలాబాద్ — ఆత్రం సక్కు (ఎస్టీ) –
మల్కాజిగిరి – రాగిడి లక్ష్మా రెడ్డి (ఓసీ) –
మెదక్ -పి.వెంకట్రామి రెడ్డి (ఓసీ)
నాగర్ కర్నూల్ – ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ (ఎస్సీ)
సికింద్రాబాద్ తీగుళ్ల పద్మారావు గౌడ్ (బీసీ) –
భువనగిరి – క్యామ మల్లేశ్ (బీసీ)
నల్గొండ కంచర్ల కృష్ణారెడ్డి (ఓసీ)
హైదరాబాద్ – – గడ్డం శ్రీనివాస్ యాదవ్ (బీసీ)