TG Politics: రజాకార్ ప్రోడ్యూసర్ కు సెంట్రల్ సెక్యూరిటీ

0
9

రజాకార్ నిర్మాత, బీజేపీ నేత గూడూరు నారాయణ రెడ్డికి కేంద్రం భద్రత కల్పించింది. బెదిరింపు కాల్స్ నేపథ్యంలో సెక్యూరిటీ కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. నిఘా వర్గాల ద్వారా కేంద్రం దర్యాప్తు చేసి నారాయణకు 1+1 సీఆర్పీఎఫ్ భద్రత కల్పించింది. హైదరాబాద్ రాజ్యంలో రజాకార్ల అఘాయిత్యాలపై తెరకెక్కిన ‘రజాకార్’ మూవీ ఈ నెల 15న థియేటర్లలో విడుదలైంది.

ఈ సినిమా పలు థియేటర్లలో నడుస్తున్న నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తుల నుంచి 1100 వరకూ కాల్స్ వచ్చాయని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై విచారణ చేసి, తనకు రక్షణ కల్పించాలని ఆయన కోరారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి గూడురుకు ముగ్గురు సీఆర్పీఎఫ్​కమాండర్లను కేటాయించింది. ప్రతి రోజూ ఇద్దరు సెక్యూరిటీ అందించేలా చర్యలు తీసుకున్నది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ముందే ఈ చిత్రం రిలీజ్ చేయాలని చూసినా.. కొన్ని అనివార్య కారణాల వల్ల పోస్ట్ పోన్ అవుతూ వచ్చి ఎట్టకేలకు ఈనెల 15న ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ సినిమాకు యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించగా.. ప్రముఖ నటి ఇంద్రజ, యాంకర్ అనసూయ కీలక పాత్రలో నటించారు. బీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు.