TG Politics: హరీశ్ రావు వన్ మ్యాన్ ఆర్మీ.. లోక్ సభ పోరులో బీఆర్ఎస్‌కు అండ

0
15

గులాబీ బాస్, ఎక్స్ సీఎం కేసీఆర్ కుటుంబ సభ్యులపై వరుసగా కేసులు నమోదవుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత అరెస్టు అయ్యారు. ఆమెను విడిపించే న్యాయపోరాటంలో కేటీఆర్ ఢిల్లీలోనే బిజీగా ఉంటున్నారు. మరో వైపు గత ప్రభుత్వ అవినీతిపై అనేక విచారణలు.. కేటీఆర్, కేసీఆర్ వైపుగా దూసుకొస్తున్నాయి. ఒక్క హరీశ్ రావు మాత్రమే అటు పర్సనల్ వ్యవహారాలు.. ఇటు పార్టీ వ్యవహారాలు చక్కబెడుతున్నట్టు కనిపిస్తున్నాయి. ఆయన పేరు కూడా పెద్దగా కేసుల్లో బయటపడటం లేదు.

కేసీఆర్ కూతురు కల్వకుంట్ల కవితను ఢిల్లీ లిక్కర్ కేసులో ఈడీ అరెస్టు చేయడం అనేది బీఆర్ఎస్ లోనూ.. కల్వకుంట్ల కుటుంబంలోనూ ఓ భారీ కుదుపుగా భావించొచ్చు. దాని నుంచి తేరుకోకముందే భూకబ్జా కేసులో కేసీఆర్ అన్న కుమారుడైన కల్వకుంట్ల కన్నారావును పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎంపీ, కేసీఆర్‌కు కొడుకు వరుసైన జోగినపల్లి సంతోష్‌కుమార్‌పై భూ కబ్జా కేసు నమోదైంది. లిక్కర్‌ పాలసీ కేసులో కవిత భర్త అనిల్ కూడా అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేయిస్తున్న అనేక విచారణలు కేటీఆర్, కేసీఆర్ వద్దకు చేరే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న విశ్లేషణలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలపై ఇప్పటికే విజిలెన్స్ విచారణతో పాటు రిటైర్డ్ జడ్జితో జ్యుడిషియల్‌ విచారణకు ప్రభుత్వం నిర్ణయించింది. అటు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు.. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ పవర్ ఫ్లాంట్ల నిర్మాణాల వివాదాలపై కూడా విచారణకు రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఫార్ములా ఈ రేస్‌ లో అవినీతి కూడా కేటీఆర్ మెడకు చుట్టుకునే ప్రమాదం ఉంది. ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తిరుగుతూ అంతిమంగా ఎవరి మెడకు చుట్టుకుంటుంది అనేది ఉత్కంఠగా మారింది. ప్రభాకర్ రావు అరెస్టైతే.. ఆయన ఎవరి పేరు చెబుతారన్నది రాజకీయ విశ్లేషకులకే అంతుబట్టడం లేదు. సో ఓవరాల్ గా.. తన చేతులకు అవినీతి మట్టి అంటకుండా సింగిల్ ఆర్మీలాగా పనికానిచ్చేస్తున్నారు హరీశ్ రావు.