TG TET Application’s: అలర్ట్… రేపటి నుంచే టెట్ అప్లికేషన్లు

0
11

తెలంగాణలో టెట్ అప్లికేషన్లు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 27 నుంచి ఏప్రిల్ 10 వరకు ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లోఅప్లై చేసుకోవాలి. ఫీ జును ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో పే చేసిన తర్వాత అప్లై చేసుకోవచ్చు. గతేడాది ఫిజికల్‌‌‌‌గా టెట్‌‌‌‌ పరీక్ష నిర్వహించగా ఒక్క పేపర్ లేదా రెండు పేపర్లు రాసినా రూ.400 మాత్రమే ఫీజు ఉండేది. ఈ సారి ఆన్‌‌‌‌లైన్‌‌‌‌లో టెట్ నిర్వహిస్తుండటంతో ఒక్క పేపర్‌‌‌‌‌‌‌‌కు 1000 చొప్పున రెండు పేపర్లకు 2 వేల ఫీజు చెల్లించాలని విద్యా శాఖ ప్రకటించింది.

ఫీజులు భారీగా పెంచడంతో టెట్ అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే డీఎస్సీ పరీక్షకు రూ.వెయ్యి చెల్లిస్తున్నామని, మళ్లీ టెట్‌‌‌‌కు అంతే ఫీజు పెట్టడం సరికాదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు లైబ్రరీల వద్ద నిరసనలు కూడా తెలిపారు. టెట్ ఫీజులపై ప్రభుత్వపెద్దలు, విద్యా శాఖ అధికారులను ఆరా తీశారు. కానీ, ఆన్‌‌‌‌లైన్ పరీక్షల నేపథ్యంలోనే ఫీజు పెంచాల్సి వచ్చిందని వారు పేర్కొన్నట్టు తెలిసింది

గురుకుల విద్యా సంస్థల రిక్రూట్‌‌మెంట్​ బోర్డు ఒక్కో అభ్యర్థి నుంచి రూ.1200 ఫీజు వసూలు చేశారని తెలిపినట్టు సమాచారం. ఆన్‌‌‌‌లైన్ పరీక్షలు కావడంతోనే దరఖాస్తు ఫీజు పెంచామని విద్యా శాఖ ఉన్నతాధికారి క్లారిటీ ఇచ్చారు. ట్రిబ్ కంటే రూ.200 తక్కువగానే తీసుకుంటున్నామని తెలిపారు. ఇప్పటికైతే ఫీజు తగ్గించాలనే ఆలోచన లేదని ఆయన వెల్లడించారు.