TS Politics: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్..!

0
25

పాయింట్ బ్లాంక్, వెబ్‎డెస్క్: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ సర్కారు కేబినెట్ విస్తరణపై ఫోకస్ పెంచింది. ఇప్పటికే ఆయా జిల్లాల నుంచి ముఖ్య నేతలు మంత్రి పదవులు ఆశిస్తుండగా.. కేబినెట్ కూర్పు పూర్తి చేసి పాలనపై మరింత దృష్టి సారించాలని భావిస్తోంది. ఈ క్రమంలో కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఈ నెల 23న రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు జరగనుండగా.. ఈ నెల 4న తెలంగాణ కేబినెట్ విస్తరణ చేపట్టనున్నట్లు తెలుస్తోంది. కేబినెట్ విస్తరణకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే అధిష్టానం నుంచి కేబినెట్ విస్తరణకు పచ్చజెండా ఊపినట్లు గాంధీభవన్ వర్గాలు తెలిపాయి.

కాగా, నిన్న గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌తో సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా మంతనాలు జరిపి కేబినెట్ విస్తరణ గురించి సమాచారం అందించినట్లు తెలుస్తోంది. ఈ నెల 4న అందుబాటులో ఉండాల్సిందిగా కోరినట్లు సమాచారం. రేపు సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. కేబినెట్ విస్తరణతో పాటు శాఖల మార్పు చేపట్టనున్నట్లు తెలిసింది. ఇప్పటికే అధిష్టానంతో రేవంత్ రెడ్డి చర్చలు పూర్తయ్యాయి. రేపు ఢిల్లీలో ఫైనల్ లిస్ట్‌పై కసరత్తు జరగనుంది. ఇంకా ఫైనలైజ్ కానీ బెర్తుల గురించి ఢిల్లీలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పి.సుదర్శన్ రెడ్డి, వాకిటి శ్రీహరిల పేర్లు దాదాపు ఖరారు కాగా.. ప్రేమ్ సాగర్ రావు, వివేక్‌లలో ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై సుదీర్ఘంగా మంతనాలు జరుగుతున్నట్లు సమాచారం. సీఎం రేవంత్ గవర్నర్‌తో కేబినెట్ విస్తరణతో పాటు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై చర్చించినట్లు తెలుస్తోంది.