Tollywood: ట్రోలింగ్ బారిన అనుపమ.. గట్టిగా ఇచ్చిన సిద్దు

0
19

ఒకప్పుడు హోమ్లీ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న అనుపమ పరమేశ్వరన్ ట్రోలింగ్ బారిన పడింది. మారుతున్న ట్రెండ్‌కు తగ్గట్టుగానే ఆమె కూడా తన ఆలోచనలను మార్చుకోవడమే ఇందుకు కారణమైంది. ఇటీవల టిల్లు స్క్వేర్ లో ఈమె కాస్త బోల్డ్ రొమాన్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైంది. ఇందులో లిప్ కిస్లు, రొమాంటిక్ సీన్లలో కూడా అనుపమ నటించింది.

దీంతో అనుపమపై పలువురు నెటిజన్లు విపరీతంగా ట్రోల్స్ చేస్తూ ఆమెను టార్గెట్ చేశారు. ఇటీవల అనుపమ గ్లామర్‌ షోపై స్పందిస్తూ ఎప్పుడు వెజ్జు తినలేము కదా.. అప్పుడప్పుడు నాన్ వెజ్ కూడా తినాలి అంటూ కామెంట్ చేసింది. వాటిపై కౌంటర్ ఇస్తూ ట్రోల్స్ చేస్తూ విపరీతంగా ఆడేసుకుంటున్నారు. అయితే లేటెస్ట్ గా టిల్లు స్క్వేర్ సినిమా నుంచి మరో కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఇందులో సిద్దు, అనుపమ పరమేశ్వరన్ లిప్ కిస్ పెట్టుకుంటూ కనిపించారు. అనుపమ ఓ చెయ్యి కాస్త అసభ్యకరంగా అనిపించడంతో.. మరోసారి అనుపమను ట్రోల్స్ తో ఆడేసుకుంటున్నారు. ఇంకా ఈ ట్రోల్స్ నడుస్తూనే ఉన్నాయి.

మూవీ ప్రిరిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. ఐటీసీ కోహినూర్ లో జరిగిన ఈవెంట్ లో మాట్లాడిన హీరో సిద్దు జొన్నలగడ్డ ట్రోలర్స్ కు వార్నింగ్ ఇచ్చారు. వారి వల్లే అనుపమ ఈవెంట్ కు రాలేకపోయిందన్నాడు. ఈవెంట్ కి హీరోయిన్ అనుపమ పరమేశ్వరన్ హాజరు కాలేదనీ.. మూవీ నుంచి రిలీజైన పోస్టర్ పై ట్రోలింగ్ అందుకు కారణమన్నాడు. ఫిమేల్ కోస్టార్, ఫిమేల్ యాక్టర్స్ గురించి కామెంట్స్ పెట్టేటప్పుడు.. అమ్మాయిని మనం ఫ్లర్ట్ చేసేటప్పుడు అంగీకరించేలాగా ఉండాలి కానీ.. ఇబ్బంది పెట్టేలా ఉండకూడదన్నాడు. ఇది చాలా సెన్సిటివ్ మ్యాటర్ అనీ..పనిలేనివాళ్లు మొబైల్, ఇంటర్నెట్ చేతిలో ఉంది కదా అని చేసే చెత్త కామెంట్లు పెడుతున్నారంటూ సీరియస్ అయ్యాడు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.