AP CM: రేపే ప్రమాణ స్వీకారం.., అటు వైపు వెళ్లకండి

0
13

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్: బుధవారం ఉ.11:27 గంటలకు సీఎంగా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే. ఈ ప్రమాణస్వీకర మహోత్సవానికి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో గన్నవరం విమానాశ్రయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ట్రాఫిక్ ఆంక్షల దృష్ట్యా విమాన ప్రయాణికులకు ప్రత్యేక సూచనలు చేయడం జరిగింది. ఆంక్షల దృష్ట్యా ప్రయాణికులు ఉదయం 9:30 గంటలలోపే విమానాశ్రయానికి చేరుకోవాలని ఎయిర్‌పోర్టు డైరెక్టర్ సూచించారు. రేపు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. విమాన సర్వీసులన్నీ యథాతథంగా నడుస్తాయని తెలిపారు.