TS Govt Good News To RTC Employees: ఆర్టీసీ ఉద్యోగులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్

0
16

TSRTC ఉద్యోగులకు శుభవార్త. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం పీఆర్సీ ప్రకటించింది. 21% ఫిట్మెంట్తో పీఆర్సీ ప్రకటించింది. జూన్ 1, 2024 నుంచి ఇది వర్తిస్తుందని పేర్కొంది. దీనివల్ల 53,071 మంది ఉద్యోగులకు లబ్ధి కలగనుంది. ఈ నిర్ణయంతో రూ.418.11 కోట్లు సంస్థపై భారం పడనుంది. ఏరియర్స్ ను పదవీ విరమణ పొందిన సమయంలో లేకుండా చెల్లిస్తామని తెలిపింది.

కాగా, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ బస్‌ భవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. టీఎస్‌ఆర్టీసీ సిబ్బంది సంక్షేమం కోసం కొన్ని నిర్ణయాలు తీసుకోవాలని చూస్తున్నాం. 2017లో ఆనాటి ప్రభుత్వం పీఆర్సీ 16 శాతం ఇచ్చారు. అప్పటి నుంచి మళ్లీ పీఆర్సీ ఇవ్వలేదు. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నప్పటికీ ఉద్యోగులకు పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఉద్యోగులకు 21 శాతం పీఆర్సీ ఇవ్వాలని నిర్ణయించామని తెలిపారు.

కాగా, ఇటీవల హైదరాబాద్‌లోని బాగ్ లింగంపల్లి ఆర్టీసీ కళాభవన్‌లో 2023-24 ఉత్తమ ఉద్యోగులు, అధికారులకు సంస్థ ఎండీ సజ్జనార్‌తో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ పురస్కారాలు అందజేశారు. అనంతరం మంత్రికి ఆర్టీసీ ఉద్యోగులు పీఆర్సీకి సంబంధించిన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం వారికి హామీ ఇచ్చారు