AP TTD: తిరుమలలో మరోసారి చిరుత కలకలం

0
20

తిరుమలలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. కాలిబాట సమీపంలో అటవీశాఖ సిబ్బంది చిరుతను గుర్తించారు.ఈనెల 26వ తేదీ వేకువ జామున 12 గంటల సమయంలోట్రాప్ కెమెరాలకు చిరుతపులి కదలికలు చిక్కింది. దీంతో అధికారులు భక్తులను, భద్రతా సిబ్బందిని అలర్ట్ చేశారు.

నడకదారిలో భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. రాత్రి సమయంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ సూచించింది. ఉదయం 6 నుండి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులకు అనుమతి ఇస్తున్నట్టు టీటీడీ వెల్లడించింది. మద్యాహ్నం 2 గంటల వరకే 12 ఏళ్ళ లోపు పిల్లల అనుమతి ఇస్తున్నట్టు తెలిపింది.

గత ఏడాది తిరుమల కాలినడక మార్గంలో చిరుత దాడిలో ఓ చిన్నారి ప్రాణాలు కోల్పోయిన విషయం అందరికి తెలిసిందే. ఇక ఆ ఘటనతో టిటిడి అధికారులు అప్రమత్తమయ్యారు. నడక మార్గంలో చిరుత సంచరించే ప్రాంతాల్లో ట్రాప్ కెమెరాలు ఏర్పాటు చేసి చిరుతపులులను బంధించడం జరిగింది