TTD Record Earnings : ఫిబ్రవరి నెలలో తిరుమలకు రికార్డు ఆదాయం

0
26

ఫిబ్రవరి నెలలో తిరుమల దేవస్థానానికి హుండీ ఆదాయం భారీగా వచ్చింది. ఫిబ్రవరి నెలలో శ్రీవారిని 19లక్షల 06వేల మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారికి హుండీ ద్వారా రూ.111.71 కోట్ల ఆదాయం వచ్చినట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు తెలిపింది. 95లక్షల 43 వేల లడ్డూలను భక్తులకు టీటీడీ విక్రయించింది. అటు 43 లక్షల 61వేల మంది భక్తులు శ్రీవారి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అలాగే 6.56 లక్షల మంది భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.

మరోవైపు తిరుమల లడ్డూ ధరలను తగ్గించాలని భక్తులు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నారు. డయల్ యువర్ ఈవో కార్యక్రమం ద్వారా ఈ డిమాండ్ ఈవో దృష్టికొచ్చింది. ప్రత్యేక పర్వదినాల్లో మినహా మిగిలిన అన్ని సమయాల్లో విరివిగా లడ్డూలు అందిస్తున్నామని అన్నారు.

ఇప్పటికే 50 రూపాయల లడ్డూతో పాటు మినీ లడ్డూ, అన్నప్రసాదం ఉచితంగా ఇస్తున్నామని.. ఈనేపథ్యంలో లడ్డూ ధరలను ఇప్పుడు తగ్గించలేమని స్పష్టం చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఆన్‌లైన్‌లో అడ్వాన్స్ ద‌ర్శనం, సేవా టికెట్లు పొందిన భ‌క్తుల‌కు వ‌స‌తి కల్పిస్తామని చెప్పారు. యువకులైన శ్రీవారి సేవకులు భక్తులకు సేవలందించేందుకు ముందుకు రావాలిని ఈవో ధర్మారెడ్డి కోరారు.