సాధారణంగా గ్రహణం సమయంలో దుష్ట శక్తుల ప్రభావం ఉంటుందని అన్ని దేవాలయాలు మూసి వేస్తుంటారు. కానీ ఏపీ లోని శ్రీకాళహస్తి ఆలయాన్ని మాత్రం తెరిచి ఉంచుతారు. శ్రీకాళహస్తిలో నవగ్రహాల్లో 7 గ్రహాలు సవ్య దిశలో, 2గ్రహాలు (రాహు, కేతువులు) అపసవ్య దిశలో తిరుగుతుంటాయి. ఇక్కడ దేవునికి నవగ్రహ కవచం ఉంటుందని, అందుకే శ్రీకాళహస్తికి గ్రహణ దోషం ఉండదని అక్కడి పూజారులు చెబుతున్నారు.
ఇది రాహు కేతు క్షేత్రమని ప్రసిద్ధి పొందింది. పుత్ర శోకానికి గరైన వశిష్ట మహర్షికి పరమేశ్వరుడు పంచముఖ నాగలింగేశ్వరునిగా దర్శనమిచ్చాడట. ఈ నాగరూపమునే బ్రహ్మదేవుడు కూడా అర్చించాడట. ఈ నాగరూపం కారణంగా ఈ క్షేత్రానికి “రాహు కేతు క్షేత్రము” అని పేరు వచ్చింది. సర్ప దోషము, రాహు కేతు గ్రహ దోషాలనుండి నివారణ కోసం ఈ స్వామిని పూజిస్తారు. స్వామి కవచము నవగ్రహ కవచమునకు అలంకారములు చేస్తారు.
ఈ దేవాలయం పేరు మూడు జంతువుల కలయికతో ఏర్పడినది.
శ్రీ అనగా సాలీడు, కాళ అనగా పాము, హస్తి అనగా ఏనుగు ల పేరుతో కాళహస్తిగా ప్రసిద్ధి చెందింది.
ఇది స్వర్ణముఖి నది తీరంలో ఉన్న క్షేత్రం. స్వర్ణముఖి ఇక్కడ పశ్చిమాభిముఖంగా ప్రవహించడం జరుగుతుంది.
ఈ దేవాలయంలోని లింగం పంచభూత లింగాలలో ఒకటైన వాయులింగం
మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో శివరాత్రి శోభతో ఆలయాలు కిటకిటలాడుతున్నాయి. భక్తులు తెల్లవారుజాము నుంచే శివయ్య దర్శనానికి పోటెత్తారు. పండుగ సందర్భంగా ఆలయాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. శ్రీశైలం, శ్రీకాళహస్తి, వేములవాడ, కీసర రామలింగేశ్వర ఆలయం, వేయిస్తంభాల గుడి, కోటిపల్లి, ద్రాక్షారామం, కాళేశ్వరం, చెర్వుగట్టు లింగమంతుల ఆలయాలకు భక్తులు భారీగా తరలివచ్చారు. శివయ్యకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు.