చెప్పులపై సోషల్ మీడియాలో రచ్చ.. దిమ్మ తిరిగే ఆన్సర్ ఇచ్చిన విజయ్ దేవర కొండ

0
13

విజయ్ దేవర కొండ ఏం చేసినా వెరైటీగానే ఉంటుందంటు తన ఫ్యాన్స్. తన యాస,భాష,ఆటిట్యూడ్ తో ఆకట్టుకుంటాడు. లేటెస్ట్ గా విజయ్ నటిస్తోన్న మూవీ ఫ్యామిలీ స్టార్ .ఇప్పటికే ఈ సినిమా పాటలు,గ్లింప్స్ కు మంచి టాక్ ఉంది. సోమవారం టీజర్ రిలీజ్ చేశారు. అయితే విజయ్ దేవర కొండ ఈ మూవీలో మిడిల్ క్లాస్ అబ్బాయ్ గా కనిపించనున్నాడు. అయితే విజయ్ దేవర కొండ టీజర్ లో బ్రాండెడ్ కంపెనీ చెప్పులు వేసుకుని ఉన్నాడు. వీటి కాస్ల్ దాదాపు 1500 నుంచి 8000 వరకు ఉంటుందని టాక్.

దీనిపై సోషల్ మీడియాలో నెటిజన్స్ ఓ ఆటాడుకుంటున్నారు. మిడిల్ క్లాస్ అబ్బాయి బ్రాండెడ్ చెప్పులు వేసుకోవడమేం? అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరమే విజయ్ కి సపోర్ట్ చేస్తున్నారు. మిడిల్ క్లాస్ అయితే బ్రాండెడ్ చెప్పులు వేసుకోవద్దా..బ్రాండెడ్ చెప్పులు డబ్బున్నోళ్లే వేసుకోవాలా? మిడిల్ క్లాస్ వేసుకోవద్దా? ఏంటని కామెంట్ చేస్తున్నారు.

బ్రాండెడ్ చెప్పులు వేసుకుని మిడిలా క్లాసా? సూపర్ అన్నా అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. దీనికి స్పందించిన విజయ్ దేవర కొండ తనదైన స్టైల్లో రిప్లై ఇచ్చాడు. సేల్ లో కొన్నా..70 శాతం ఆఫర్ లో అని ఆన్సర్ ఇచ్చాడు. దీంతో నెటిజన్ కు దిమ్మతిరిగే ఆన్సర్ ఇచ్చినట్లు అయ్యింది. విజయ్ ఆన్సర్ మామూల్గ లేదంటూ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.