TS POLITICS : వ‌రంగ‌ల్ బీఆర్ఎస్‌కు మ‌రో షాక్‌.. కాంగ్రెస్‌లో చేరిన మేయ‌ర్ సుధారాణి

0
15

వ‌రంగ‌ల్ : లోక్‌స‌భ ఎన్నిక‌ల స‌మ‌యంలో వ‌రంగ‌ల్ బీఆర్ఎస్ పార్టీకి మ‌రో ఎదురుదెబ్బ త‌గిలింది. తాజాగా వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. హైద‌రాబాద్ గాంధీభ‌వ‌న్‌లో కాంగ్రెస్ పార్టీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జ‌గ్గారెడ్డి స‌మ‌క్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. గత కొద్దిరోజులుగా గుండు సుధారాణి బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోబోతున్నారు అన్న చర్చ జరిగింది. అయితే ఆ చర్చకు ఊతమిస్తూ ఇటీవల వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వరంగల్ పర్యటనలో కూడా ఆమె పాల్గొనలేదు. కేటీఆర్ సభకు గుండు సుధారాణి డుమ్మా కొట్టారు.