TS POLITICS : వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్యాడ్యువేట్ MLC ఎన్నికల షెడ్యూల్ విడుదల

0
12

పాయింట్ బ్లాంక్, వెబ్‌డెస్క్ : వరంగల్-నల్లగొండ-ఖమ్మం గ్యాడ్యువేట్ MLC ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ అయింది. మే 2న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. మే 9 వరకు నామినేషన్లకు అవకాశం కల్పించారు. మే 10న నామినేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. నామినేషన్ల ఉపసంహరణకు మే 13 వరకు గడువు కేటాయించారు. గ్యాడ్యువేట్ ఎమ్మెల్సీ పోలింగ్ మే 27న జరగనుంది. ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుంది. జూన్ 5న ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టనున్నారు. జనగామ ఎమ్మెల్యేగా పల్లారాజేశ్వర్ రెడ్డి గెలిచిన తర్వాత ఈ స్థానానికి ఆయన రాజీనామా చేయడంతో ఉపఎన్నిక అనివార్యమైన విషయం తెలిసిందే.

కాగా, నల్గొండ-వరంగల్‌-ఖమ్మం పట్టభద్రుల ఉపఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిగా తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌ను బరిలో దింపుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించింది. ఈ మేరకు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ పేరిట బుధవారం ప్రకటన విడుదల చేశారు. గతేడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి భారాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఎమ్మెల్సీ పదవీకి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఉపఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఈ స్థానానికి తుది ఓటరు జాబితాను వెలువరించగా..మొత్తం 4.61 లక్షల మంది పట్టభద్రులు ఓటర్లుగా నమోదు చేసుకున్నారు