Shreyanka Patil: యూత్‌కి కొత్త క్రష్.. ఎవరీ శ్రేయాంక పాటిల్?

0
30

ఆర్సీబీ డబ్ల్యూపీఎల్ కప్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన శ్రేయాంక పాటిల్ నేషనల్ క్రష్‌గా మారారు. నెట్టింట ఆమె గురించే చర్చ నడుస్తోంది. ఫైనల్‌లో 4 వికెట్లు తీసిన పాటిల్, సీజన్‌లో 13 వికెట్లు తీసి పర్పుల్ క్యాప్‌ను, ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డును సొంతం చేసుకున్నారు. దీంతో శ్రేయాంక పాటిల్ ఎవరని నెటిజన్లు సెర్చింగ్ మొదలు పెట్టారు.

శ్రేయాంక పాటిల్‌ 2002లో బెంగళూరులో జన్మించింది. దేశీవాళీ క్రికెట్‌లో కర్ణాటక జట్టుకు ప్రాతినిథ్యం వహిస్తున్న ఆమె.. అద్భుతంగా రాణించింది. దీంతో ఆమెకు భారత జట్టులోకి వచ్చింది. గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేతో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టింది. ఇప్పటివరకు భారత్‌ తరపున 2 వన్డేలు, 6 టీ20లు ఆడిన శ్రేయాంక.. 12 వికెట్లు పడగొట్టింది.

ఇక డబ్ల్యూపీఎల్‌ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు కొనుగోలు చేసింది. ఐపీఎల్‌ డబ్ల్యూపీఎల్‌ 2023 వేలంలో శ్రేయాంకను రూ.10 లక్షల కనీస ధరకు ఆర్‌సీబీ కొనుగోలు చేసింది. 2024 సీజన్‌కు ముందు రిటైన్‌ చేసుకుంది. కాగా స్మృతి మంధాన నాయకత్వంలోని ఆర్‌సీబీ.. ఆదివారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో ఆర్‌సీబీ కప్ కరువు తీర్చింది.