Where Is Sharmila: షర్మిలమ్మ ఎక్కడ.. గీతాంజలి మరణంపై నటి పూనమ్ కౌర్ ట్వీట్..

0
9

గీతాంజలి మరణంపై ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల స్పందించకపోవడంపై నటి పూనమ్ కౌర్ ట్వీట్ చేశారు. ‘స్త్రీ నాయకత్వానికి మొదటి ప్రధాన లక్షణం స్త్రీలు, పిల్లల పట్ల కనికరంగా ఉండటం. ప్రస్తుతం రాష్ట్రాన్ని కుదిపేసిన గీతాంజలి ఘటనపై షర్మిల మౌనంగా ఉండటం నన్ను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెనాలిలోని సామాన్య మహిళలు, బాలికలు బయటకొచ్చి వారికి పాఠం చెప్పాల్సిన అవసరం ఉంది’ అని పేర్కొన్నారు.

అంతేకాకుండా మృతురాలికి న్యాయం జరగాలంటే, దీనికి కారణమైన వారికి శిక్ష పడాలంటూ సోషల్‌ మీడియా వేదికగా డిమాండ్ చేసింది నటి పూనమ్. ‘గీతాంజలికి న్యాయం జరగాలి. అసలు ఆమె విషయంలో ఏం జరిగింది? గీతాంజలికి ఎందుకు ఆత్మహత్య చేసుకునే దుస్థితి వచ్చింది? ఒక పార్టికి చెందిన సోషల్‌ మీడియా‌ ట్రోలర్స్‌ కారణంగానే ఆమె బలవన్మరణానికి పాల్పడిందా? అమ్మాయిల మీద ఇలా లేని పోని పుకార్లు పుట్టించి, మానసికంగా వేధించడం కొందరికి బాగా అలవాటైపోయింది. దయచేసి వారిని కఠినంగా శిక్షించండి. ఆ పసి పిల్లలు (గీతాంజలి బిడ్డలు)కు న్యాయం చేయండి’ అని ట్వీట్ చేసింది పూనమ్.

గీతాంజలిది చిన్న పిల్ల మనస్తత్వం అని, ఇలా జరుగుతుందని మేము ఊహించలేదన్నారు ఆమె భర్త బాలచందర్‌. వీడియో మాట్లాడినప్పుడు చాలా ఆనంద పడిందని, ఆ వీడియోకి సోషల్ మీడియాలో వస్తున్న కామెంట్లకు తనలో తానే బాధపడిందని, ఫోన్ చూస్తూ నిత్యం ఏడ్చేదన్నారు. తెనాలిలోని ఇస్లాం పేటకు చెందిన గీతాంజలి దేవి (29) బాలచంద్ర దంపతులు. వీరికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కాగా భర్త బాలచంద్ర బంగారం పనిచేస్తుంటారు. అయితే సొంతిల్లు లేని వారికి ఇటీవలే ప్రభుత్వం ఇంటి పట్టాలను అందించింది. ఈ నేపథ్యంలో గీతాంజలికి కూడా ప్రభుత్వం తరుపున ఇల్లు మంజూరు కాగా.. ఇటీవల తెనాలిలో వైసీపీ నిర్వహించిన సభలో గీతాంజలికి ఇంటిస్థలం పట్టా అందజేశారు.