Raj Tarun-Lavanya Case: లావణ్య కొట్టిన దెబ్బతో.. రాజ్ తరుణ్ చాప్టర్ క్లోజ్..!

0
87

పాయింట్ బ్లాంక్, వెబ్ డెస్క్: లావణ్య-రాజ్‌ తరుణ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. రాజ్ తరుణ్ తనను మోసం చేశాడని.. కొన్నేళ్లుగా సహజీవనం చేయడంతో పాటు.. తనకు అబార్షన్ చేయించాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పాటు.. కొన్ని ఫోటోలను, టెక్నికల్ ఎవిడెన్స్‌ను నార్సింగి పోలీసులకు అందించింది లావణ్య. ఆ తర్వాత లావణ్య(Lavanya) తన సోదరుడికి అభ్యంతరకర మెసేజ్‌లు పంపుతోందని.., తమను బెదిరిస్తోందంటూ సినీ నటి మాల్వీ ఫిల్మ్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు లావణ్య మోసగత్తె అంటూ రాజ్‌ తరుణ్ విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఆధారాలు ఇవ్వడంతో రాజ్‌ తరుణ్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో లావణ్య రాజ్ తరుణ్ లేకుండా తన జీవితం లేదని.. తాను చచ్చిపోతున్నా అంటూ ఓ మెసేజ్‌(Message)ను తన లాయర్‌కు పంపిచింది. తాను చనిపోవాలని రాజ్ తరుణ్ కోరుకుంటున్నాడని.. రాజ్ తల్లిదండ్రులు తన చావుకు కారణమంటూ ఓ సూసైడ్ నోట్‌ను రాసింది. లావణ్య లాయర్ విషయాన్ని పోలీసులకు తెలియజేయడంతో నార్సింగి పోలీసులు లావణ్య ఇంటికి వెళ్లి ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చారు. రాజ్ తరుణ్‌‌పై కేసు నమోదు చేసినప్పటికీ.. అతడిని అరెస్ట్ చేయలేదు. మరోవైపు రాజ్ తరుణ్ కుటుంబం తనను టార్గెట్ చేస్తుందంటూ లావణ్య ఆరోపిస్తోంది. ఈక్రమంలో తాను చచ్చిపోతానని.. తన చావుకు ప్రధాన కారణం మాల్వీతో పాటు రాజ్ తల్లిదండ్రులంటూ సూసైడ్ నోట్‌లో పేర్కొంది. ఈ పరిస్థితులు చూస్తుంటే లావణ్య రాజ్‌తరుణ్‌ని వదిలేలా లేదనే చర్చ జరుగుతోంది. ఇంత జరిగినా రాజ్ తరుణ్‌పై మాత్రం లావణ్య ప్రేమ చూపిస్తూనే ఉంది. ఇప్పటికీ రాజ్ కావాలని అంటోంది. దీంతో అసలు లావణ్య ప్లాన్ ఏమిటనేది ఆసక్తిగా మారింది.

టార్గెట్ మాల్వీ..
తనకు దక్కని రాజ్ తరుణ్ మాల్వీకి దక్కకూడదనేదే లావణ్య ప్లాన్‌గా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. దాదాపు వారం రోజులకు పైగా లావణ్య, రాజ్ తరుణ్ మధ్య వివాదం కొనసాగుతుండగా.. దీనిపై ఇప్పట్లో ముగింపు దొరికేట్లు కనిపించడం లేదు. లావణ్య మాత్రం రోజుకో కొత్త అంశాన్ని తెరపైకి తెస్తూ వివాదాన్ని మరింత రాజుకునేలా చేస్తోంది. మొదట్లో రాజ్ తరుణ్‌కు ఎక్కువ మంది మద్దతివ్వగా.. ఫోటోలతో పాటు టెక్నికల్ ఎవిడెన్స్‌లు పోలీసులకు ఇవ్వడంతో రాజ్ తరుణ్‌పై వ్యతిరేకత మొదలైంది. మొదట్లో లావణ్యపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేసిన రాజ్ ప్రస్తుతం కొంత తగ్గినట్లు కనిపిస్తోంది. మాల్వీని రాజ్‌ తరుణ్‌కు దూరం చేయడమే లావణ్య లక్ష్యంగా కనిపిస్తోంది. రాజ్-లావణ్య వివాదం రోజురోజుకు ముదురుతుండటంతో.. రాజ్ తరుణ్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. రాజ్‌ను పోలీసలు అరెస్ట్ చేస్తే మాల్వీనే రాజ్‌కు దూరమవుతుందనే ఆలోచనతోనే లావణ్య మాస్టర్ ప్లాన్ వేసినట్లు తెలుస్తోంది.

రాజ్ వెనక్కి తగ్గారా..!
రాజ్ తరుణ్- లావణ్య మధ్య వివాదం ముదురుతుండటంతో రాజ్ కొంచెం వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని మరీ పెద్దది చేసుకుంటే తన కేరీర్‌పై ప్రభావం చూపిస్తుందనే ఆలోచనలో రాజ్ ఉన్నట్లు తెలుస్తోంది. దీంతో గత మూడు రోజులుగా లావణ్య కామెంట్స్‌పై రాజ్ రెస్పాండ్ కావడంలేదు. దీంతో రాజ్ వెనక్కి తగ్గారా అనే చర్చ వినిపిస్తోంది. లావణ్య విషయంలో రాజ్ ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్లారు.. రానున్న రోజుల్లో ఈ వివాదం ఎన్ని మలుపులు తిరుగుతుందనేది వేచి చూడాల్సి ఉంది.

మరిన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..