WTC మొనగాడు హిట్ మ్యాన్..ఒక్క సెంచరీతో ఎన్నోరికార్డులు బద్దలు

0
23

ధర్మశాలలో ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదో టెస్టులో భారత కెప్టెన్ రికార్డ్ సృష్టించాడు.టెస్టుల్లో 12 వ సెంచరీ చేసిన చేసిన రోహిత్ శర్మ ఓవరాల్ గా 48వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. యాక్టివ్ ప్లేయర్లలో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా రోహిత్ మూడో స్థానంలో ఉన్నారు. అలాగే ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్‌ చరిత్రలో అత్యధిక సెంచరీలు బాదిన క్రికెటర్ల జాబితాలో రోహిత్‌ శర్మ 9 సెంచరీలతో నాలుగో స్థానానికి ఎగబాకాడు.

డబ్ల్యూటీసీ చరిత్రలో అత్యధిక సెంచరీల వీరులు

జో రూట్‌(ఇంగ్లండ్‌)- 13
మార్నస్‌ లబుషేన్‌(ఆస్ట్రేలియా)- 11
కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌)- 10
రోహిత్‌ శర్మ(ఇండియా)- 9
బాబర్ ఆజం(పాకిస్తాన్‌)- 8

రోహిత్‌శర్మ మరో రికార్డును కూడా తన పేరిట లిఖించుకున్నాడు. ఓపెనర్‌గా అంతర్జాతీయ క్రికెట్‌లో ఎక్కువ శతకాలు బాదిన వారి జాబితాలో 43 సెంచరీలతో రోహిత్‌ మూడో స్థానంలో నిలిచాడు. ఓపెనర్లుగా వార్నర్‌(49), సచిన్‌(45) తర్వాత స్థానంలో రోహిత్‌ నిలిచాడు. ప్రపంచ టెస్టు ఛాంపియ‌న్ షిప్‌లో 50 సిక్సర్లు బాదిన తొలి భార‌త ఆట‌గాడిగా రోహిత్‌శర్మ చరిత్ర సృష్టించాడు
ఓవరాల్ గా ఇంగ్లాండ్‌ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఇప్పటి వరకు అత‌డు 78 సిక్సర్లు కొట్టాడు.

అంతర్జాతీయ క్రికెట్లో ఎక్కువ సెంచరీలు చేసిన యాక్టివ్ ప్లేయర్లు

విరాట్ కోహ్లి- 80
డేవిడ్ వార్నర్- 49
రోహిత్ శర్మ- 48
జో రూట్ – 47
కేన్ విలియమ్సన్ – 45