Yadadri Ustavalu: నేటి నుంచి యాదాద్రి బ్రహ్మోత్సవాలు

0
21

నేటి నుంచి యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి 21వ తేదీ వరకు వైభవంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు ఆలయ ఈవో ప్రకటించారు.  తొలిరోజు స్వస్తీవాచనం, అంకురారోపణం, విశ్వక్సేనారాధన, రక్షాబంధనంతో ఉత్సవాలకు శ్రీకారం చుట్టనున్నారు.

యాదాద్రిలో ఈ నెల 17న స్వామి వారి ఎదుర్కోలు, 18న స్వామి వారి తిరు కల్యాణోత్సవం, 19న దివ్య విమాన రథోత్సవం, 20న  మహాపూర్ణాహుతి, చత్రతీర్థం నిర్వహించనున్నారు. 21న అష్టోత్తర శతఘటాభిషేకం, డోలోత్సవంతో బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి.  బ్రహ్మోత్సవాల నేపథ్యంలో ఈ నెల 11 నుంచి 21 వరకు నిత్య కల్యాణం, బ్రహ్మోత్సవం, సుదర్శన నారసింహ హోమం, మొక్కు సేవలను రద్దు చేశారు.

10 వేల మంది కూర్చునేలా ప్రత్యేక కల్యాణ మండపాన్ని సిద్ధం చేస్తున్నారు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలకు సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులంతా విచ్చేయనున్నారు. స్వామివారికి రేవంత్‌రెడ్డి పట్టువస్ర్తాలు సమర్పించే అవకాశం ఉంది. 11 గంటలకు సీఎం, మంత్రులు తిరిగి హెలికాప్టర్‌లో భద్రాచలం పర్యటనకు బయల్దేరి వెళ్లనున్నారు