ఎండాకాలంలో చల్లని కబురు ఇది. వేసవి తాపంతో అల్లాడుతున్న తెలంగాణ వాసులకు వాతావరణ శాఖ తీపికబురు చెప్పింది. మూడు రోజుల పాటు తెలంగాణకు భారీ వర్షసూచన ఉన్నట్టు తెలిపింది.
సోమవారం సాయంత్రం హైదరాబాద్ ఒక్కసారిగా చల్లబడింది. రాత్రి 7 గంటల నుంచి 11 గంటల వరకు అనేక ప్రాంతాల్లో జల్లులు కురిశాయి. మధ్యాహ్నం ఎండలో అలసిపోయిన నగర వాసులు సడెన్ గా కురిసిన జల్లులతో రిలాక్స్ అయ్యారు.
సోమవారం ఉమ్మడి ఆదిలాబాద్, ఉమ్మడి కరీంనగర్, భూపాలపల్లి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మంగళవారం నుంచి హైదరాబాద్, రంగారెడ్డి, మల్కాజ్‌గిరికి కూడా అలర్ట్ ఉంటుందని తెలిపింది. ఈనెల 21వరకు ఆయా జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ మూడురోజుల పాటు ఈదురుగాలులు, ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు పడతాయని అంచనా వేసింది వాతావరణ శాఖ. సో బీ అలర్ట్. ఈ వానల్లో తడవడం పిల్లలకు అంత మంచిది కాదు.